ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ సేవ క్లినిక్‌లు

ABN, First Publish Date - 2022-12-07T22:29:27+05:30

ఏర్పాట్లు పరిశీలిస్తున్న ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, ఐపీఎస్‌ డాక్టర్‌ చేతన నేటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీలు ఆర్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ చేతన అభ్యర్థులకు ట్రయల్‌ రన్‌ నిర్వహణ మహబూబ్‌నగర్‌, డిసెంబరు7: ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు నేటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల కోసం స్టేడియం మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఎగ్జామ్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లు జిల్లా ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు, ఐపీఎస్‌ డా.చేతనలు స్టేడియం మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. రేడియో ఫ్రీక్వెన్సీ, , సెన్సార్‌ పద్దతుల ద్వారా పరుగు, లాంగ్‌జంప్‌, షార్ట్‌పుట్‌, ఎత్తు వంటి ఈవెంట్లు కొలిచే విధానాన్ని ట్రయల్‌రన్‌ ద్వారా గమనించారు. రన్నింగ్‌ ట్రాక్‌, గ్రౌండ్‌ నిర్వహణ పరిశీలించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేహదారుఢ్య పరీక్షలు జరిపే అయా పరికరాల ను సంబంధిత అధికారులతో తనిఖీ చేయించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అభ్యర్థుల సర్టిఫికెట్‌ల తనిఖీ మొదలు పరీక్షలు పూర్తిచేసుకుని బయటకు వెళ్ళేవరకు పోలీస్‌ అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, కచ్చితంగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడ దన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్‌ ఆఫీసర్‌ అదనపు ఎస్పీ ఏ రాములు, డీఎస్పీలు, ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీస్‌లు పాల్గొన్నారు. భార్యను హత్య చేసిన భర్త కోయిలకొండ, డిసెంబరు 7: భర్త చేతిలో భార్య హత్యకు గురైన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం మల్కాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సీనయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కిష్ఠంపల్లి లలితమ్మ(38) బుధవారం ఉదయం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లో మేకలు మేపుతుండగా భర్త సాయన్న ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో గొడ్డలితో భార్య తలపై బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ రాజేశ్వర్‌గౌడ్‌ పరిశీలించారు. మృతురాలి తమ్ముడి చింతకింద లాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే స్తున్నట్లు తెలిపారు. హత్య చేసిన భర్త పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముందుకు వచ్చిన ఈ వరల్డ్‌ గ్లోబల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌

పాలమూరులో జనవరి నుంచి అంతర్జాతీయ స్థాయి ఆధునిక వైద్యం

ఈ- గ్లోబల్‌ డాక్టర్లతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వర్చువల్‌ మీటింగ్‌

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం) డిసెంబర్‌ 7: మహబూబ్‌నగర్‌ జిల్లాలో అంతర్జాతీయ స్థాయి ఆధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నా మని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అమెరికా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి వివిధ దేశాల్లో స్థిరపడ్డ ఉమ్మడి జిల్లాకు చెందిన డాక్టర్లతో డా.శ్రీనిగంగాపాని ఆధ్వర్యంలో ఈ- వరల్డ్‌ గ్లోబల్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో బుధవారం ఈ-గ్లోబల్‌ డాక్టర్స్‌ వర్చువల్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పలువురు డాక్టర్లు వివిధ దేశాల్లో స్థిరపడ్డారని, వారంతా ఈ వరల్డ్‌ గ్లోబల్‌ డాక్టర్స్‌ అనే అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకొని ఉమ్మడి జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. వారి సహకారంతో జిల్లాలోని డాక్ట ర్లతో కలిసి జనవరి 2023 నుంచి కన్సల్టింగ్‌ ఈ-సేవ క్లీని క్‌లను ఏర్పాటు చేయనున్న ట్లు వెల్లడించారు. పుట్టిన గడ్డకు ఏదైనా సహాయం చే యాలని ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందు తున్న పాలమూరును సీఎం కేసీఆర్‌ సహకారంతో మెడికల్‌ టూరిజంగా తీర్చిదిద్దుతామ న్నారు. వర్చువల్‌ మీటింగ్‌లో వివిధ దేశాల్లోని ప్రముఖ డా క్టర్లు, జిల్లాకు చెందిన ఐఎంఏ జిల్లా అఽధ్యక్షుడు డాక్టర్‌ రాం మోహన్‌, డాక్టర్లు మధుసూ దన్‌రెడ్డి, శ్యామ్యూల్‌, శరత్‌ చంద్ర, వంశీకృష్ణ, రవిచందర్‌, సీఈవో సాఫ్ట్‌ పాథ్‌ సిస్టమ్స్‌ విజయ్‌కాంత్‌, జనరల్‌ ఆస్ప త్రి డిప్యూటీ సూపరింటెం డెంట్‌ జీవన్‌, మహేష్‌బాబు, నర్సింహులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising