ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుడప్పుడూ ఆటవిడుపు ఉండాలి

ABN, First Publish Date - 2022-09-30T04:39:04+05:30

విద్యుత్‌ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులు రీచార్జ్‌ అయ్యేలా నెలకోసారి ఆటవిడుపు ఉండాలని ఉమెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.తులసీనాగరాణి అన్నారు.

విద్యుత్‌ భవన్‌లో బతుకమ్మ సంబురాలు చేసుకుంటున్న మహిళలు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఉమెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.తులసీనాగరాణి

పాలమూరు, సెప్టెంబరు 29 : విద్యుత్‌ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగులు రీచార్జ్‌ అయ్యేలా నెలకోసారి ఆటవిడుపు ఉండాలని ఉమెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.తులసీనాగరాణి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌లో నిర్వహించిన బతు కమ్మ సంబురాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రొటీన్‌ జీవితమే కాకుండా ఆటవిడుపు ఉంటే మహిళలు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్‌.ఈ ఎన్‌.శ్రీరామమూర్తి, డీఈటీ డి.చంద్రమౌళి, డీఈలు సి.వెంకటశివరాం, మోహనకృష్ణ, చాంద్‌పాషా, ఎస్‌ఏవో వి.శ్రీకాంత్‌, ఏడీఈలు, ఏఈలు, మహిళా ఉద్యోగులు సుధారాణి, ఆసియాముబిన్‌, సరిత హిమబిందు, పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

ఘనంగా బతుకమ్మ వేడుకలు

అడ్డాకుల, సెప్టెంబరు 29 : మండల కేం ద్రంలో గురువారం బతుకమ్మ వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి తీరొక్క పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మల తో మహిళలు మండల కేంద్రంలోని సంత బజారుకు చేరుకున్నారు. విద్యార్థులు కోలా టాలతో, డప్పువాయిద్యాలతో బతుకమ్మల కు స్వాగతం పలికారు. మండల కేంద్రానికి వందలాదిగా చేరుకున్న మహిళలు ముసు రువర్షాన్ని లెక్కచేయకుండా దాదాపు రెండు గంటల పాటు బతుకమ్మల చుట్టూ బొడ్డె మ్మ ఆడారు. ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి సతీమణి ఆల మంజల గ్రామస్థుల తో కలిసి బతుకమ్మఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా కానుకగా సీఎం కేసీఆర్‌ చీర లు అందజేస్తున్నారని అన్నారు. ప్ర జలు ఆదరించాలని కోరారు. ఎం పీపీ నాగార్జున్‌రెడ్డి, జడ్పీటీసీ రాజశే ఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్య క్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌ విండో అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు మహిమూద్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-09-30T04:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising