ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పది’ పరీక్ష కేంద్రాల్లో ఇబ్బందుల్లేకుండా చూడాలి

ABN, First Publish Date - 2022-05-25T05:32:31+05:30

పది పరీక్ష కేంద్రాల వద్ద ఎలాం టి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకట్‌రావు ఆదేశించారు.

పరీక్ష కేందాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ వెంకట్‌రావు  - పరీక్షలకు 98.60 శాతం హాజరు  

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 24 : పది పరీక్ష కేంద్రాల వద్ద ఎలాం టి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ వెంకట్‌రావు ఆదేశించారు. మంగళవారం పదో తరగతి పరీక్షల సందర్భంగా జిల్లా కేంద్రం లోని బేసిక్‌ ప్రాక్టీసింగ్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలకు హాజరైన తీరును చీఫ్‌ సూపరింటెం డెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులను అడిగి తెలుసకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రంలో ఏఎన్‌ఎంల వద్ద ఉన్న మందులను పరిశీలించారు. బందో బస్తులో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని,  ఇతరులు ఎవరూ పరీక్ష కేంద్రాలలోకి రాకుండా చూడాలన్నారు.  

ఫ పదోతరగతి పరీక్షలకు మంగళవారం ద్వితీయ లాంగ్వేజ్‌ పరీక్ష నిర్వహిం చారు. ఈ పరీక్ష జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాలలో సజావుగా సాగింది. పరీక్షలకు 13,268 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 13,082 మంది విద్యార్థులు హాజరు కాగా, 186 మంది విద్యార్థులు హాజరు కాలేదు. పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌, డీఈవో ఉషారాణి, స్వ్యాడ్‌బృందాలు పరిశీలించారు. 

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా విద్యాశాఖాధికారి 

మూసాపేట : మండల కేంద్రమైన మూసాపేట, జానంపేట గ్రా మాలలోని పదో తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి ఉషారాణి మంగళవారం పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో తాగు నీరు, వైద్యం వంటి  సౌక ర్యాలు అందుబాటులో ఉంచడంతో డీఈవో సంతృప్తి వ్యక్తం చేశారు. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఈవో సూచిం చా రు. పరీక్ష సమయం కన్నా విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరు కున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల దగ్గర 144వ సెక్షన్‌ విధించడంతో సమీ పంలోని దుకాణ సముదాయాలు మూసివేశారు. డీఈవో వెం ట తహసీల్దార్‌ మంజుల, ఎంపీడీవో స్వరూప, మండల విద్యాధికారి రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు.

 రెండవ రోజు ప్రశాంతం

దేవరకద్ర : మండల కేంద్రంలో పదవ తరగతి రెండవ రోజు పరీక్ష మంగళ వారం ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈవో జయశ్రీ తెలిపారు. మండలంలోని మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 933 మంది విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరు కాగా, 930 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను తహసీల్దార్‌ జ్యోతి తనిఖీ చేశారు.

ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు 

బాదేపల్లి : జడ్చర్ల పట్టణంలో నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలో 7 కేంద్రాలు, మండలంలోని కోడ్గల్‌ జడ్పీఉన్నత పాఠశాలలోని కేంద్రాల్లో మొత్త 1860 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా, 20 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఎంఈవో కె. మంజులాదేవి తెలిపారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ విధించడంతో కేంద్రాల సమీపంలో ఉన్న దుకాణాలను మూసివేశారు. 

బాలానగర్‌ మండలంలో..

బాలానగర్‌ : మండల కేంద్రంలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. కేంద్రాల్లో మొత్తం 739 మంది విద్యా ర్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 14 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు ఎంఈఓ వెంకటయ్య తెలిపారు.

Updated Date - 2022-05-25T05:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising