ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ పాలనలో జీతాలు ఇవ్వలేని దుస్థితి

ABN, First Publish Date - 2022-07-06T04:52:07+05:30

ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితిలో కేసీఆర్‌ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాజీ మంత్రి నాగం  జనార్దన్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 5: ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితిలో కేసీఆర్‌ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాజీమంత్రి నాగం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజె క్టుల పేరుతో కోట్ల రూపాయలు అవినీతికి పా ల్పడిన కేసీఆర్‌ చివరకు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్ధిక స్థితిని దివాలా తీశారని ఆరో పించారు. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిని తాను నిరూపిస్తానని, సోమజీగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చ లకు కేసీఆర్‌, హరీశ్‌రావు ఎవరొస్తారో చెప్పాల న్నారు.  మోదీ, కేసీఆర్‌లు ఒకరినొకరు తిట్టు కుంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. రాష్ట్రం కోసం వందలాది మంది బలిదానాలకు చలించిపోయిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, కాని టీఆర్‌ఎస్‌ పాలనలో అమరుల త్యాగాలు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జలాల రాష్ట్ర వాటా సాధనలో సీఎం కేసీఆర్‌ పూర్తిగా విఫలం చెందారని ఆరోపించారు. కేసీఆర్‌ పాలన తీరు మారకపోతే రాష్ట్రంలో మరో ఉద్యమం తప్పదని నాగం హెచ్చరించారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు, తాడూరు జడ్పీటీసీ సభ్యురాలు రోహిణిరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మల్లయ్యగౌడ్‌, ఐతోలు లక్ష్మయ్య, తిమ్మాజిపేట పాండు, కౌన్సిలర్లు నిజాముద్దీన్‌, సుల్తాన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T04:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising