ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల భూములకు పట్టాలు ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-12-15T23:58:19+05:30

పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు

దామరగిద్ద, డిసెంబరు 15 : పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ వెంకట్రాములు పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రథమ మహాసభలు నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములకు పట్టాలు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పటికైనా పేదల భూములు తీసుకోవడం నిలిపివేయడంతో పాటు సాగులో ఉన్న రైతులకు కొత్త పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రానున్నకాలంలో జిల్లా వ్యాప్తంగా పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని అందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. పేదలకు ఇచ్చిన హామీలు దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, అర్హులకు పింఛన్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది ప్రవహిస్తున్నా ఆ నీటిని పాలకుల నిర్లక్ష్యం కారణంగా వినియోగించుకోలేక పోతున్నామన్నారు. అదే విధంగా కేంద్రం ప్రభుత్వం సామాన్య ప్రజలపై పెనుభారాలు మోపుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. వంట గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర ధరలు పెంచడంతో పేదల బతుకు భారమైందన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సంస్థలన్నింటీని ప్రైవేటు కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తోందన్నారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుడు వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలప్ప, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం జిల్లా నాయకుడు కాశీనాథ్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌, నాయకులు శివకుమార్‌, ముస్తాపేట్‌ సర్పంచ్‌ లాలప్ప, జోషి, హన్మంతు, నర్సిములు, భాస్కర్‌, మల్లయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising