ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-07-29T05:47:59+05:30

వీఆర్‌ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా జిల్లా నాయకుడు కిరణ్‌ పేర్కొన్నారు.

మక్తల్‌లో మాట్లాడుతున్న సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా జిల్లా నాయకుడు కిరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్తల్‌, జూలై 28 : వీఆర్‌ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా జిల్లా నాయకుడు కిరణ్‌ పేర్కొన్నారు. గురువారం మక్తల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు చేపట్టిన  నిరవధిక సమ్మె గురువారం నాలుగో రోజుకు చేరింది. వీఆర్‌ఏల సమ్మెకు ఏఐకేఎంఎస్‌, ఐ ఎఫ్‌టీయూ, పీడీఎస్‌యూ నేతలు సంపూర్ణ మద్దతు తెలిపి మాట్లాడారు. వారం రోజుల నుంచి 23వేల మంది వీఆర్‌ఏలు పే స్కేల్‌ అమలు పర్చాలని ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో ప్రజలు, ప్రభుత్వానికి అనుసంధానంగా పని చేస్తున్న వీఆర్‌ఏలపై సవతి ప్రేమ సరికాదన్నారు.  సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన మేరకు వీఆర్‌ఏలకు పే స్కేల్‌, 55ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగం, ఇంక్రిమెంట్లు, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు భగవం తు, ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుట్టో, పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు భాస్కర్‌, అజయ్‌, వీఆర్‌ ఏల సంఘం జిల్లా కన్వీనర్‌ బండారి కృష్ణ, వీఆర్‌ఏ లు ఆంజనేయులు, ఎం.కురుమయ్య, వై.కురుమ య్య, విజయ్‌కుమార్‌, కవిత, నర్సిములు, రమేష్‌, ఆ శప్ప, రాజన్న, బాలకృష్ణ, లింగం పాల్గొన్నారు.  

దామరగిద్ద : సీఎం కేసీఆర్‌ అసెంభ్లీలో వీఆర్‌ఏలకు ప్రకటించిన పే స్కేల్‌ జీవోను వెంటనే విడుదల చేయాలని సీపీఎం జిల్లా నాయకుడు గోపాల్‌ పేర్కొన్నారు. గురువారం తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర కొనసాగుతున్న నిరవధిక సమ్మెను సీపీఎం, బీజేపీ మండల నాయకులు, సందర్శించి మద్దతును తెలియజేశారు. సమస్య పరిష్కారయ్యే వరకు వీఆర్‌ఏలు ఐక్యంగా ఉండి పోరాటం చేయా లన్నారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్‌రావు, సత్యనారాయణ, అంజిలప్ప, గోపాల్‌, జోషి, శివకుమార్‌, మహేష్‌గౌడ్‌, కేవీపీఎస్‌ నాయకులు హన్మంతు, వీఆర్‌ఏల సంఘం నాయకులు శ్యామప్ప, నర్సప్ప, నాగమణి, నర్సమ్మ పాల్గొన్నారు.

మాగనూరు : వీఆర్‌ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కృష్ణ మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు సి.ద్రమురెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు వీఆర్‌ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె గురు వారం నాల్గో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రకటించిన మేరకు వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేయాలన్నారు.  రిటైర్డు వీఆర్వో హను మంతు, యాదయ్య, వెంకటేష్‌, సత్యనారాయణ, మహిపాల్‌రెడ్డి, హనుమంతు, గీతాబాయి, అర్చన, సునీత, రాజేశ్వరి, నర్సిములు, ప్రమీల, భీమేష్‌, మాధవి, అజియా పాల్గొన్నారు.



Updated Date - 2022-07-29T05:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising