ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారానికి సన్నద్ధం కావాలి

ABN, First Publish Date - 2022-05-27T05:09:34+05:30

తెలంగాణ రాష్ట్ర 8వ విడత హరితహారం కార్యక్రమం జూన్‌ మొదటి వారం నుంచి ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్‌కర్నూల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి):  తెలంగాణ రాష్ట్ర  8వ విడత హరితహారం కార్యక్రమం జూన్‌ మొదటి వారం నుంచి ప్రారంభించేందుకు  సన్నద్ధం కావాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్‌ మనూచౌదరితో కలిసి హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి సన్నద్ధతపై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరిస్తూ జూన్‌ 2వ రాష్ట్ర అవ తరణ దినోత్సవమైన మరుసటి రోజు నుంచే పల్లె, పట్టణ ప్రగతితోపాటు తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. అందుకు తగ్గట్టుగా  జిల్లాకు ఇచ్చిన హరితహారం లక్ష్యం 68.70లక్షల మొక్కలు నాటేందుకు స్థలం గుర్తింపు చేసుకోవడం, ఏ మొక్కలను ఎక్కడ నాటాలి, మొక్కలు ఏ నర్సరీ నుంచి తెచ్చుకోవాలనేది పకడ్బందీగా ప్రణాళిక చేసుకోవాలన్నారు. అధికారుల ద్వారా గుర్తిం చిన సైట్లకు వర్క్‌ ఎస్టిమేషన్‌ చేసే బాధ్యత మండల అభివృద్ధి అధికారులదేనని సూ చించారు. మే 31వ తేదీలోపు ఎస్టిమేషన్‌ జనరేషన్‌ పూర్తి కావాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఈసారి ఇరిగేషన్‌ సైట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని, ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన ఖాళీ స్థలంలో కెనాల్‌ పొంటి, మట్టితీసిన, పోసిన ప్రాంతాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఖాళీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేయాలని ఇరిగేషన్‌ అధికారిని ఆదేశించారు. జాతీయ రహదారిపై ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ రహదారుల పొడవునా మూడు వరుసల్లో మొక్కలు కన్పించాలని మొదటి వరుసలో పెద్ద ఎత్తున టెకోమ లాంటి పూల మొక్కలు నా టాల్సిందిగా ఆదేశించారు. పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుధ్యం, హరితహారం, విద్యుత్‌ వైర్లు వంటి కార్యక్రమాలు పకడ్బందీగా ఉండాలని, చేసిన పనులకు ఫోటోలు తీయిం చి ఆల్బంగా చేసి పంపించాలన్నారు. ప్రతీ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యాలయాల్లో పచ్చని మొక్కలు కన్పించేవిధంగా నాటాలని ఆదేశించారు. ఈసారి ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు ఆకస్మిక పర్యటనలు చేసే అవకా శం ఉందని, అందుకనుగుణంగా ఎక్కడ నిర్లక్ష్యానికి తావులేకుండా హరితహారం, పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ మనూచౌదరి, డీఆర్‌డీవో పీడీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-27T05:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising