ప్రజలందరూ ఏసు ప్రేమను పొందటమే లక్ష్యం
ABN, First Publish Date - 2022-12-15T23:17:02+05:30
ప్రజలందరు ఏసుక్రీస్తు ప్రేమను పొందటమే లక్ష్యంతో ముందుకు సాగుదామని మెన్నోనైట్ బ్రదరన్ చర్చి పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్ అన్నారు.
- నేడు జిల్లా కేంద్రంలో సెమీ క్రిస్మస్ ఉత్సవాలు
- ఎంబీసీ చర్చి పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్
పాలమూరు, డిసెంబరు 15 : ప్రజలందరు ఏసుక్రీస్తు ప్రేమను పొందటమే లక్ష్యంతో ముందుకు సాగుదామని మెన్నోనైట్ బ్రదరన్ చర్చి పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని చర్చి ఆవర ణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం పెద్దలతో కలిసి ఆయన సెమీ క్రిస్మస్ ఉత్సవాల ప్రణాళికను వివరించారు. నవంబరు 26 నుంచి డిసెంబరు 22 వరకు సెమీ క్రిస్మస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తు న్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, భక్తులు, విశ్వాసుల హృదయాలను ఏసుప్రభు చేరుకోవాలన్నారు. చిన్నారులు, బాలబాలికలు, యవ్వనస్థులు, స్త్రీలు, ప్రజలు క్రిస్మస్ సంబరాలను జరుపుకోవాలన్నారు. పాటలు, డ్యాన్సులు, నృత్య గేయా లు, చిన్ననాటికల ద్వారా ఏసుక్రీస్తు చరిత్రను వ్యక్త పరచాలని ప్రజలకు సూ చించారు. జనవరి 1వ తేదీన అనాథ శరణాలయాలు, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, స్వీట్లు పంచిపెట్టనున్నట్లు తెలిపారు. 17న క్రిస్టియన్ కాలనీ, 18న ఇంగ్లీష్ నర్సరీ, 19న షాలేము చర్చి, 20న కల్వరి కొండలో క్రిస్మస్ ఉత్సవాల ను సంఘం పెద్దలతో కలిసి నిర్వహిస్తామని ఆయన అన్నారు. 16న(నేడు) నిర్వహించే సెమీ క్రిస్మస్ ఉత్సవాలకు సందేశానిచ్చేందుకు హైదరాబాద్ నుంచి రెవరెండ్ వి.ప్రతాప్‌కుమార్ విచ్చేస్తారని పేర్కొన్నారు. సమావేశంలో వైస్ చైర్మన్ జే.ఐ యోహోన్, కోశాధికారి బీఐ జేకోబ్, ప్రధాన కార్యదర్శి పి.శామ్యూల్, సభ్యులు ఆర్ఎష్ జోసెఫ్, ఆర్.కే హీరాంరాయ్, డీకన్స్ టీ.ఏ స్టీవెన్, ఎస్.కే స్వామిదాసు, కేఎన్ పౌల్, ఎస్బీ అబ్రహాం, ఏఆర్ రాజేష్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:17:05+05:30 IST