ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

ABN, First Publish Date - 2022-01-27T05:23:37+05:30

భారత గణతంత్ర వేడుకలను బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ వద్ద జెండావిష్కరణ చేస్తున్న కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నిరాడంబరంగా గణతంత్ర వేడుకలు

- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు

- హాజరైన ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు

 మహబూబ్‌నగర్‌(కలెక్టరేట్‌), జనవరి 26: భారత గణతంత్ర వేడుకలను బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఉదయం 10 గంటలకు జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన జెండాకు సెల్యూట్‌ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, జిల్లా స్థాయి అధికారులు హాజరయ్యారు. ముందుగా కలెక్టర్‌, ఎస్పీ విడి విడిగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంత రం జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం గణ తంత్ర దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగానే విద్యార్థినులకు నోటు బుక్కులు, పెన్నులు కలెక్టర్‌, ఎస్పీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోట్ల వనజాత, డీఎం జగదీశ్వర్‌, కలెక్టర్‌ కార్యాలయం విభాగాల అధిపతులు, సి బ్బంది పాల్గొన్నారు.

 

జెండావిష్కరణ చేసిన ఎస్పీ  

మహబూబ్‌నగర్‌: గణతంత్ర వేడుక లను పురస్కరించుకుని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ఆర్‌.వెంకటేశ్వర్లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డా క్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఎంతో శ్రమించి పటిష్టమైన భారత రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. అంబేడ్కర్‌ అంద రికీ ఆదర్శప్రాయుడని, ఆయన స్ఫూర్తి తో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు కిషన్‌, సాయిమనోహర్‌, ఇన్‌స్పెక్టర్లు సోమ్‌నారాయణసింగ్‌, సురేశ్‌, శ్రీనివాస్‌, అప్పలనాయుడు, రాజేశ్వర్‌గౌడ్‌, మహేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 







Updated Date - 2022-01-27T05:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising