ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవాహం నిలిచింది.. పనులెప్పుడో?

ABN, First Publish Date - 2022-11-24T23:37:24+05:30

గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలి పోతున్నది. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో గ్రామస్థులే దారి చేసుకుంటున్నా రు.

రెండు రోజుల క్రితం గ్రామస్థులు వేసుకున్న మట్టి రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల, నవంబరు 24: గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణం కలగానే మిగిలి పోతున్నది. 2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చకపోవడంతో గ్రామస్థులే దారి చేసుకుంటున్నా రు. ఎప్పటిలా గానే ఈ ఏడాది కూడా రంగాపురం వైపు కృష్ణానదిలో రూ.3 లక్షల వ్యయంతో తాత్కాలికంగా మట్టిరోడ్డును వేసుకున్నారు. వరద పూర్తిగా తగ్గిపోయినా నేటికీ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించ కపోవడంతో గ్రామస్థులే దారి వేసుకుంటున్నారు.

ప్రారంభ దశలోనే బ్రిడ్జి నిర్మాణం

గుర్రంగడ్డ గ్రామ ప్రజల చిరకాల స్వప్నం బ్రిడ్జి నిర్మాణం. 2018 ఎన్నికల సందర్భంగా గద్వాలలో సీఎం కేసీఆర్‌ హామీ ఇవ్వడం వెను వెంటనే జీవో విడుదల చేయడం జరిగింది. రూ. 9.47 కోట్లతో టెండర్లను పిలిచి శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించక పోవ డంతో ఇరిగేషన్‌ అధికారులు పలు దఫాలుగా నోటీసులు జారీ చేశారు. ఎట్టకేలకు ఈ ఏడాది మే నెలలో పనులను ప్రారంభించారు. 11 పిల్లర్లు కొద్ది ఎత్తుమేరకు నిర్మించారు. ఆలోపే కృష్ణానదికి వరద రావడంతో పనులు నిలిచిపోయాయి. నెల రోజుల నుంచి ఎలాంటి ప్రవాహం లేదు. బ్రిడ్జి నిర్మాణానికి అనువైన కాలం అయినా కాంట్రాక్టర్‌ ముందుకు రావ డం లేదు. ఇరిగేషన్‌ అధికారులు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోతున్నది. ఈ ఏడాది కూడా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే అవకాశం కని పించడం లేదు. కృష్ణానదికి వరద ప్రారంభమైతే పుట్టి ప్రయాణం తప్ప డం లేదు. ప్రవాహం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత వ్వవసాయ ఉత్ప త్తులు తరలించడానికి, ఎరువులు, విత్తనాలను తెచ్చుకోవడానికి ప్రతీ ఏడాది రంగాపురం వైపు తాత్కాలిక రోడ్డును నిర్మించుకుంటారు. రెండు రోజుల క్రితం రూ.3 లక్షలు ఖర్చుచేసి మట్టి రోడ్డు వేసుకున్నారు. కలెక్టర్‌ ఇస్తేనే బిల్లు.. లేదంటే గ్రామస్థులే విరాళాలు వేసు కుంటారు. ఈ ఏడాది మట్టిరోడ్డుకు బిల్లు ఇచ్చేది లేదని కలెక్టర్‌ తేల్చి చెప్పినట్లు సమాచారం.

గుర్రంగడ్డలో..

గద్వాల మండలంలో కృష్ణానది మధ్యలో ఉన్న దివి గ్రామమే గుర్రంగడ్డ. గద్వాలకు రావాలంటే బీరోలు వైపు పుట్టి ప్రయాణం చేయాలి. ఈ గ్రామంలో మొత్తం 194 ఇండ్లు ఉన్నాయి. ప్రస్తుతం జనాభా 950మంది. గ్రామం మొత్తం విస్తీర్ణం 2,400ఎకరాలు ఇందులో సాగుభూమి 1,150ఎకరాలు ఉంది. 1,100 ఎకరాలలో రెండు పంటలు వరి సాగు చేస్తారు. మరో 50ఎకరాలలో కంది ఇతర పంటలు సాగు చేస్తారు. వ్యవసాయ పనులకు గ్రామ ప్రజలు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి కూలీలను పుట్టీలలో తీసు కవచ్చి పనులు చేసుకుంటారు. పంట ఉత్పత్తు లను విక్రయించి కావాల్సిన ఎరువులు విత్తనాలను నదికి వరద ప్రారంభం కాక ముందే తెచ్చుకుంటారు.

Updated Date - 2022-11-24T23:37:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising