ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండగ సాయన్నకు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-08-09T04:58:54+05:30

తెలంగాణ రాబిన్‌ హుడ్‌ పండగ సాయన్న జయంతి సందర్భంగా సోమవారం ముదిరాజ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటా నికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

మక్తల్‌లో పండగ సాయన్న చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న ముదిరాజ్‌ సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మక్తల్‌, ఆగస్టు 8 : తెలంగాణ రాబిన్‌ హుడ్‌ పండగ సాయన్న జయంతి సందర్భంగా సోమవారం ముదిరాజ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటా నికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా ముదిరాజ్‌ యూత్‌ నాయకులు మాట్లాడు తూ భూస్వామ్య వ్యవస్థను ఎదిరించి  పేదలకు సంక్షేమ ఫలాలు అందించిన గొప్ప వీరుడు అని కొనియాడారు. ఇప్పటికీ పేద ప్రజల గుండెల్లో చెర గని ముద్ర వేసిన పండుగ సాయన్న జానపదాల్లో సజీవంగా నిలిచిన మహనీయుడు అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా పండుగ సాయన్న జీవిత చరిత్ర ను తెరకెక్కిస్తున్నారన్నారు. ముదిరాజ్‌ యూత్‌ నా యకులు మామిళ్ల పృథ్విరాజ్‌, పీకే నర్సింహా, నవీన్‌ కుమార్‌, యాదగిరి, ఆనంపల్లి రమేష్‌, వాకిటి రమే ష్‌, శేఖర్‌, అభిషేక్‌, ఆనంద్‌, చిట్టిరాజ్‌, సంతోష్‌, శం కర్‌, వినయ్‌, నవీన్‌, వల్లంపల్లి రమేష్‌ పాల్గొన్నారు. 

 ధన్వాడ : పెత్తందారులు, దొరల అరాచ కాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి బహుజనుల ఆకలి తీర్చిన గొప్ప నాయకుడు పండగ సాయన్న అని అలాంటి నాయకుడి స్ఫూర్తిగా బహుజన రాజ్యాన్ని స్థాపిస్తామని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొదిగెల శ్రీనివాసులు అన్నారు. సోమవారం పం డుగ సాయన్న జయంతిని సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీఎస్పీ నాయకులు చంద్రయ్య, జడల బాల్‌రాజు, కడప రాయుడు, నీరటి నర్సిములు నాయుడు ముదిరాజ్‌, బాల్‌చందర్‌, మోహన్‌ కృష్ణ, నాగయ్య బాల్‌రాజు, రాజు పాల్గొన్నారు.

 మరికల్‌ : మండల కేంద్రంలోని ఇందిరా గాంఽధీ చౌరస్తాలో సోమవారం ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడు కానుగంటి నారాయణ ఆధ్వర్యంలో పం డగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జంగిడి శ్రీను, చంద్రశేఖర్‌, తిరుపత య్య, మాలె శ్రీను, కుర్మన్న, కొండన్న తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-09T04:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising