ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపల పెంపకం అంతంతే..

ABN, First Publish Date - 2022-12-16T23:10:23+05:30

చేపల ఉత్పత్తి పెంచడంతో పాటు, మత్స్యకారులకు ఉపాఽధి కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం మహబూబ్‌నగర్‌ జిల్లాలో భిన్న ఫలితాలనిస్తోంది.

కోయిల్‌ సాగర్‌లో చేపపిల్లలు వదులుతున్న మంత్రి, ఎమ్మెల్యేలు(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లాలో భారీగా చేపపిల్లల పంపిణీ

- అధిక వ్యయం చేస్తున్నా ప్రయోజనం నామమాత్రమే

- చేపల చెరువుల నిర్వహణలో పలు సవాళ్లు

- మరింత ప్రోత్సాహం అవసరమంటున్న మత్స్యకారులు

- రాజకీయ జోక్యం తగ్గాలనే సూచనలు

పాలమూరు, డిసెంబరు 16 : చేపల ఉత్పత్తి పెంచడంతో పాటు, మత్స్యకారులకు ఉపాఽధి కల్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం మహబూబ్‌నగర్‌ జిల్లాలో భిన్న ఫలితాలనిస్తోంది. ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధుల సూచనలు, మత్స్యసహకార సంఘాల సమన్వయంతో అధికారులు ఆయా చెరువుల సామర్థ్యం మేరకు చేపపిల్లలను ఉచితంగా అందిస్తున్నారు. చేపపిల్లలను వదిలే టప్పుడు ఉన్న ఉత్సాహం పెంపకం, అమ్మకాలపై లేకపోవడం, చేపల పెంపకం బాధ్యతలను సంఘాలపై వదిలేయడం, చెరువుల నిర్వహణలో సంఘాల సభ్యులకు పలు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. ప్రభుత్వం ఎంతగానో ఆశించిన ఈ పథకం ద్వారా చేపల ఉత్పత్తిలో ఆశించిన ఫలితం రావడం లేదు. వదిలిన చేప పిల్లల ద్వారా రావాల్సిన ఉత్పత్తిలో 40శాతమే వస్తుందని వాపోతున్నారు.

ఫలితం ఇవ్వడం లేదు..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో చేపల ఉత్పత్తికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆశించిన ఫలితాలివ్వడం లేదు. మత్స్యకారుల ప్రయోజనాలరీత్యా రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను పంపిణీ చేస్తున్నా.. పెద్దగా లాభం ఉండటం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. జిల్లాలో ఆరు విడతలుగా ప్రతియేటా దాదాపు 1.50 కోట్ల పైచిలుకు చేపపిల్లలను పంపిణీ చేస్తున్నారు. కనీసం ఎనిమిది నెలలపాటు వీటిని పెంచడం కోసం మత్స్యకారులు శ్రమకోరుస్తున్నారు. చేపల పెంపకంలో దాదాపు 60 శాతం మేర నష్టపోగా, సగటున 40శాతమే మాంసం ఉత్పత్తివస్తోందని, దీంతో ప్రభుత్వం ఆశించిన రీతిలో ఆదాయం పొందలేక పోతున్నామని మత్స్యకారులు వేదన చెందుతున్నారు. జిల్లాలో ఈ యేడాది 1,016 చెరువుల్లో, సుమారు 1,83,96,000 చేపపిల్లలను వదిలారు. 219 ప్రాథమిక సంఘాల ద్వారా సుమారు 11,879 మంది మత్స్యకారుల ఆధీనంలో చేపల పెంపకం జరుగుతుంది. దాదాపు 80శాతం చేపపిల్లలు బతికినా భారీగా ఉత్పత్తి వస్తుందని, కానీ ఆరేళ్ల రికార్డులను పరిశీలిస్తే సగటున 40శాతం చేపపిల్లలే ఎదిగి మాంసంగా విక్రయానికి వచ్చి మత్స్యకారులకు ఆదాయం వస్తుందని, దీని ప్రకారం ఈ ఏడాది కూడా 40శాతం అంచనాతోనే సుమారు 3,500 మెట్రిక్‌టన్నుల చేపల ఉత్పత్తి వస్తుందని భావిస్తున్నారు.

చెరువుల నిర్వహణలోనే అసలు సమస్య..

ప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా అందజేసినా, వాటిపెంపకం, చెరువుల నిర్వహణలో పలు సవాళ్లు ఎదుర్కొవాల్సి వస్తోందని, దీంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఉచితంగా ఇస్తున్నారనే నెపంతో కాంట్రాక్టర్లు చేపలను నిర్ణీత సైజులో ఇవ్వడం లేదని, ఈ విషయాన్ని గట్టిగా నిలదీసే పరిస్థితి లేకుండా పోయిందని చెబుతున్నారు. నాణ్యతలేని, సైజు తక్కువున్న చేపపిల్లల్లో బతికి, మాంసంగా ఎదిగే శాతం తగ్గుతుందని చెబుతున్నారు. 35ఎంఎం నుంచి 40 ఎంఎం వరకు ఒకరకం, 80 ఎంఎం నుంచి 100 ఎంఎం వరకు మరోరకం చేపపిల్లలను పంపిణీ చేశారు. అయితే ఈసైజుల్లో నిర్ణీతమయిన ప్రకారం పిల్లలను ఇవ్వలేదని, 28 ఎంఎం చేపలు కూడా వచ్చాయని, 60ఎంఎం చేపలూ ఉన్నాయని వీటిలో చాలావరకు తరుగుపోతున్నాయని అందువల్లే ఉత్పత్తి తగ్గుతోందని జిల్లాలోని మత్స్యకార ప్రాథమిక సంఘం అధ్యక్షుడు ఒకరు ఆంధ్రజ్యోతికి తెలిపారు. ఈవిషయమై అధికారులను ప్రశ్నించినా, జిల్లా సంఘాన్ని సంప్రదించినా తనను ప్రాథమిక సంఘం అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తే మరోసారి ఇలాంటి వివాదం చేయకుండా ఉంటావని హెచ్చరించారని, దీంతో చేసేదేమీలేక మిన్నకుండిపోయానని వాపోయారు. అదేవిధంగా మత్స్యకారసంఘాలకే చెరువుల్లో చేపల పెంపకం, అమ్మకాల బాధ్యతలుండాల్సి ఉంటే, ఇందులోనూ రాజకీయాలు చేస్తున్నారని వాపోతున్నారు. చేపలు మాంసానికి రావడానికి ముందే కొందరు చెరువులను రాత్రివేళ ఉద్దేశపూర్వకంగా లూటీ చేయడం, గండ్లుకొట్టడం చేస్తున్నారని దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని కొందరు ప్రాథమిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. దీనికితోడు సంఘాల్లో రాజకీయనాయకుల అనుచరులు, జిల్లా సంఘం ప్రతినిధుల జోక్యం ఎక్కువవడంతో తమకు ఇబ్బంది కలుగుతోందని ఆరోపణలు చేశారు. ప్రధానంగా జిల్లాలో ఒక గ్రూపుగా ఏర్పాటైన కొందరు వ్యక్తులు చెరువులన్నింటిపైనా పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దీంతో క్షేత్రస్థాయిలో తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

Updated Date - 2022-12-16T23:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising