ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు సకాలంలో పూర్తిచేస్తేనే ఆనకట్ట పటిష్టం

ABN, First Publish Date - 2022-01-29T05:09:06+05:30

ఆర్డీఎస్‌ ప్రధాన ఆనకట్ట వద్ద జరగాల్సిన ప్యాకేజీ-1 పనులు సకాలంలో పూర్తి చేస్తేనే ఆనకట్ట పటిష్టంగా ఉంటుందని కేఆర్‌ఎంబీ(కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు) సభ్యులు తెలిపారు.

సింధనూర్‌ రెగ్యులేటర్‌ వద్ద ఆర్డీఎస్‌ కాలువను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆర్డీఎస్‌ను పరిశీలించిన కేఆర్‌ఎంబీ సభ్యులు

- సింధనూర్‌లో హెడ్‌ రెగ్యులేటర్‌ పరిశీలన

- టెలిమెట్రీ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆరా 


అయిజ, జనవరి 28 : ఆర్డీఎస్‌ ప్రధాన ఆనకట్ట వద్ద జరగాల్సిన ప్యాకేజీ-1 పనులు సకాలంలో పూర్తి చేస్తేనే ఆనకట్ట పటిష్టంగా ఉంటుందని కేఆర్‌ఎంబీ(కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు) సభ్యులు తెలిపారు. శుక్రవారం బృంద సభ్యులు  రవికుమార్‌ పిళ్లై, ఎస్‌ఈ అశోక్‌, ఈఈ శ్రీనివాస్‌, డీఈ సచింద్రానాథ్‌సేథ్‌, ఏఈ నిరంజన్‌ప్రాద్‌లు కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్టను సందర్శించి, పరిశీలించారు. అనంతరం అయిజ మండలం సింధ నూర్‌ గ్రామ సమీపంలోని హెడ్‌ రెగ్యులేటర్‌ను, కాలువను పరిశీలించారు. అలాగే, తుమ్మిళ్ల ఎత్తి పోతల పథకం, సుంకేసుల రిజర్వాయర్‌ను కేఆర్‌ ఎంబీ బృందం సందర్శించింది. ఆర్డీఎస్‌ ఆధునీకీకరణలో భాగంగా ఆర్డీఎస్‌ ప్రధాన ఆనకట్ట వద్ద జరగాల్సిన ప్యాకేజీ-1 పనులు సకాలంలో పూర్తి చేస్తేనే ఆనకట్ట పటిష్టంగా ఉంటుందని వారు వెల్లడించారు. ఆ తర్వాత అయిజ మండలంలోని సింధనూర్‌ గ్రామ సమీపంలో హెడ్‌ రెగ్యులేటర్‌ను పరిశీలించారు. టెలిమెట్రీ ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులను అడిగి తె లుసుకున్నారు. అలాగే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథ కం, సుంకేసుల రిజర్వాయర్‌, కేసీ కాలువను కే ఆర్‌ఎంబీ బృందం పరిశీలించింది. సుంకేసుల, కేసీ కాలువ నీటి వినియోగం, టెలిమెట్రీ విధానం తదితర అంశాలపై కర్నూల్‌ ఇరిగేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల పనితీరు, నీటి లభ్యత, వినియోగం, ఆయకట్టు అంశాలపై పూర్తిగా అధ్య యనం చేసేందుకే ప్రాజెక్టులను సందర్శించినట్లు పిళ్లై తెలిపారు. పూర్తి నివేదికను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ వీకే సింగ్‌కు అందజే యనున్నట్లు కేఆర్‌ఎంబీ సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బోర్డు ఎస్‌సీఈ అశోక్‌, ఆర్డీఎస్‌ ప్రాజెక్టు ఈఈ శ్రీనివాస్‌, డీఈ సచింద్రనాథ్‌సేత్‌, ఏఈ నిరంజన్‌ప్రసాద్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T05:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising