ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2022-05-20T04:55:36+05:30

తెలంగాణ ప్రగతిశీల ఆటో, మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఇప్ట్యూ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ఆటో ర్యాలీని నిర్వహించారు.

పేటలో ఆటో కార్మికుల ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట టౌన్‌, మే 19 : తెలంగాణ ప్రగతిశీల ఆటో, మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఇప్ట్యూ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌ నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ఆటో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్ట్యూ జి ల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 2019 మోటార్‌ వాహనాల చట్టం తీసుకురాగా ఈ చట్టం సేప్టీ పేరుతో కార్మికులకు గుది బండగా మారిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఫ్రభుత్వాలు ఏప్రిల్‌ 1 నుంచి జీవో నంబర్‌ 714 ప్రకారం ఫిట్నెస్‌ రెనివల్‌ గడువు అయ్యాక రూ.50 ఫెనాల్టీ వేస్తున్నా రని, ట్రాఫిక్‌ పోలీసులు ఈ చలాన్‌ పేరుతో రూ.1035 వసూలు చేస్తుండడంతో కార్మికులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. వెంటనే ప్రభుత్వాలు సేప్టీ బిల్లును రద్దు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు రఫీ, గౌస్‌, శాదిక్‌, నారాయణ, కతలప్ప, అంజప్ప, హన్మంతు, భగవంతు, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T04:55:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising