ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వర్గీయుల మధ్య ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-01-15T05:09:43+05:30

నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండ లంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వర్గీయు ల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

పరస్పరం ఆందోళనకు దిగిన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనం


లింగాల, జనవరి 14: నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండ లంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వర్గీయు ల మధ్య ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఈ విధంగా ఉన్నా యి. గత మూడు రోజుల క్రితం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలలో విజేతల కు బహుమతుల పంపిణీ కారక్రమానికి మాజీ ఎమ్మెల్యే వం శీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వంశీకృష్ణ మాట్లాడుతూ వ్వాపారుల సొమ్ముతో దుకాణాల సముదాయాన్ని నిర్మించి గులాబీ కలర్‌ వేయడమే గాకా దా నికి జీబీఆర్‌ కాంప్లెక్స్‌ అని పేరు పెట్టడం ఏమిటని  ప్రశ్నిం చారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిదిగా టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లు తయ్యారయ్యారని విమర్శించారు. తాము అధికారం లోకి వస్తే జీబీఆర్‌ పేరును తొలగిస్తానని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యనించారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తీవ్రం గా ఖండించారు. అంతేగాక రోడ్డుపైకి వచ్చి మాజీ ఎమ్మెల్యే ఎదుటనే ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్‌ వర్గీయులు ప్రధా న మార్గంపై మాజీ ఎమ్మెల్యే దిష్టి బొమ్మను దహనం చేశా రు. దీనికి ప్రతిగా కాంగ్రెస్‌ వర్గీయులు ఎమ్మెల్యే గువ్వల బా లరాజ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయా పార్టీల వారు ఎదురెదురుగా తారసపడి నినాదాలతో హోరెత్తించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వ చ్చి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని సద్దుమణిగించారు. 



Updated Date - 2022-01-15T05:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising