ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పది పరీక్షలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-24T04:50:09+05:30

పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత ప్రత్యక్ష పరీక్షలు నిర్వహించడంతో పలువురు విద్యార్థులు ఉదయం ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు.

మహబూబ్‌నగర్‌ మోడల్‌ బేసిక్‌ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గంట ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

విద్యార్థుల తల్లిదండ్రుల రాకతో హడావుడి

మహబూబ్‌నగర్‌లో కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ వెంకట్రావు

మొదటి రోజు ప్రశాంతం



మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మే 23: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత ప్రత్యక్ష పరీక్షలు నిర్వహించడంతో పలువురు విద్యార్థులు ఉదయం ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థుల వెంట తల్లిదండ్రులు, సంరక్షకులు రావడంతో సందడి నెలకొంది. గంట ముందే విద్యా ర్థులు కేంద్రాల వద్దకు వచ్చారు. తొమ్మిది గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించారు. కేంద్రాల్లో తాగునీరు, వైద్యం వంటి సౌకర్యాలను కల్పించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడిపారు. హాల్‌ టికెట్‌ చూపితే ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. పరీక్షలు మొదటి రోజు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాడల్‌ బేసిక్‌ ఉన్నత పాఠశాల కేంద్రాన్ని కలెక్టర్‌ వెంకట్‌రావు పరిశీంచారు. ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు గురించి డిపార్ట్‌మెంట్‌ అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లను తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, డీఈవో ఉషారాణి, డీఎల్‌ఓ, స్క్వాడ్‌ బృందాలు కేంద్రాలను పరిశీలించారు.


ప్రశ్న పత్రాలు లీక్‌ కాకుండా ప్రత్యేక దృష్టి 

పదో తరగతి ప్రశ్న పత్రాలు లీక్‌ కాకుండా రెవె న్యూ, పోలీస్‌, విద్యాశాఖ అధికారులు పకడ్బందీ చర్య లు చేపట్టాలని కలెక్టర్‌ వెంకట్‌రావు అదేశించారు. పరీక్షల నిర్వ హణపై రెవె న్యూ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. గ్రామీణ ప్రాంతా లలో ఉన్న కేంద్రాల్లో వసతుల గురించి ఆరా తీశారు. పరీక్ష పూర్తయ్యే వరకు విద్యుత్‌ సరఫరా లేకుండా చూడాలని ఎస్‌ఈని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సీతా రామా రావు, డీఈవో ఉషారాణి పా ల్గొన్నారు.

Updated Date - 2022-05-24T04:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising