తహసీల్దార్‌కార్యాలయం ముట్టడి
ABN, First Publish Date - 2022-10-11T04:24:55+05:30
గ్రామ సేవకులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయా లని చేపట్టిన నిరవధిక సమ్మె 78వ రోజుకు చే రుకున్నది.
- గ్రామ సేవకులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
- మా డిమాండ్లు నెరవేర్చే దాకా ఉద్యమిస్తాం : గ్రామ సేవకులు
కొత్తకోట, అక్టోబరు 10: గ్రామ సేవకులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయా లని చేపట్టిన నిరవధిక సమ్మె 78వ రోజుకు చే రుకున్నది. ఈ సందర్భంగా సోమవారం తహసీ ల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. విధులకు హాజరు కావడానికి వస్తున్న అధికారులను అ డ్డుకున్నారు. తమకు రెవెన్యూ అధికారులు అండ గా ఉండాలని కోరుతూ గంటపాటు కార్యాలయం లోనికి వెళ్లనియలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామ సేవకు లు వెంకట్రాములు, బాలకృష్ణ, శ్రీనువాసులు, రామచంద్రయ్య, బాబు సాగర్, శివ నారాయణ, అలివేల, అనిత, శిరీష, భాగ్యమ్మ, విజయ కుమా రి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఖిల్లాలో
ఖిల్లాఘణపురం : ఖిల్లాఘణపురంలో గ్రామ సేవకుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు సోమవా రం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సేవకుల మం డల అధ్యక్షుడు రామ్మోహన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ శాసనసభ సాక్షిగా వీఆర్‌ఏలకు పే స్కేల్, ప్రమోషన్లు, 55 ఏళ్లు నిండిన గ్రామ సేవ కుల వారసులకు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చి నీటికీ నెరవేర్చడం లేదని అన్నారు. మా డిమాండ్లు నెరవేర్చే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరస నలు తెలుపుతూనే ఉంటామని అన్నారు. కార్యక్ర మంలో గ్రామ సేవకుల మండల ఉపాధ్యక్షులు శేషయ్య, స్వప్న, వెంకటయ్య గౌడ్, యాదయ్య, కాశన్న, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరులో...
ఆత్మకూర్: గ్రామ సేవకుల సమస్యలు పరిష్క రించాలని సోమవారం తహసీల్దార్ కార్యాలయా న్ని ముట్టడించారు. ఈ సందర్భంగా గ్రామ సేవ కుల సంఘం మండల అధ్యక్షుడు గోవింద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇ చ్చిన హామీలను అమలు చేయకపోవడం సరైంది కాదని అన్నారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి పదోన్నతులు వారసత్వ ఉద్యోగాలు, పే స్కేల్ ప్ర కారం వేతనాలు అమలు చేస్తామని నేటి వరకు అమలు చేయకపోవడంతో తహసీల్దార్ కార్యా లయం ముట్టడించామని తెలిపారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని గోవింద్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ మతిన్ ఫిర్యాదుతో పోలీసుల గ్రామ సేవకులను అరెస్టు చేశారు. కార్యక్రమంలో గ్రామ సేవకుల సంఘం నాయకులు శ్రీనివాసులు, పరశురాం, రంగన్న, చింతలన్న, రాముతో పాటు తిమ్మక్క పావని తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-11T04:24:55+05:30 IST