డిసెంబర్లో సిలబస్ పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2022-12-15T22:42:42+05:30
డిసెంబర్లో సిలబస్ పూర్తి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాకీర్‌హుస్సేన్ సూచించారు.
- జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాకీర్‌హుస్సేన్
వనపర్తి రూరల్, డిసెంబరు 15: డిసెంబర్లో సిలబస్ పూర్తి చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాకీర్‌హుస్సేన్ సూచించారు. గురు వారం వనపర్తి పట్టణ పరిధిలోని ప్రభుత్వ జూని యర్ కాలేజీ(ఉర్దూ మీడియం)లో వనపర్తి జిల్లా లోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సి పాల్స్, లెక్చరర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిష నర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైదరా బాద్ వారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రతీ కాలేజీలో డిసెంబరు 2022 చివరికల్లా సిలబస్ పూర్తిచేసి వచ్చే జనవరి, ఫిబ్రవరి 2023 మాసా ల్లో, ఈ అకాడమీ విద్యా సంవత్సరం 2022-23లో నిర్వహించబోయే ఎంసెట్నకు ఆసక్తి గల విద్యా ర్థులను గుర్తించి ఎంసెట్ కోచింగ్ ఇవ్వాలని అన్నారు. ఎంసెట్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర విద్యార్థులు సైతం చేరేలా చూడాలని పేర్కొన్నారు. ఇంటర్ ఐపీఈ 2023 పరీక్షల నిర్వ హణ అనంతరం ఏప్రిల్, మే 2023లో ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ సమ్మర్ ఎంసెట్ కోచింగ్ ఇవ్వ డంపై ఉన్నతాధికారులు సూచించిన సెంటర్లో విద్యార్థులకు స్ర్కీనింగ్ టెస్టు నిర్వహణ ఉంటుం దన్నారు. అందులో నుంచి 50 మంది విద్యార్థు లు, 50 మంది విద్యార్థినీలు ఎంసెట్-2023నకు ఎంపిక చేయబడతారని అన్నారు. ప్రైవేటుకు ధీ టుగా ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు చదవాల ని ఆయన సూచించారు.
Updated Date - 2022-12-15T22:42:43+05:30 IST