ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2022-12-12T22:43:09+05:30

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ప్రాథమిక పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్‌ చేశారు.

జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ప్రాథమిక పాఠశాలలో ఓ విద్యార్థిని విద్యా సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధులకు ఆలస్యం కావడంతో వేటు వేసిన కలెక్టర్‌

కావేరమ్మపేట ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ

జడ్చర్ల, డిసెంబరు 12 : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ప్రాథమిక పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ప్రధానోపాధ్యాయురాలిని సస్పెండ్‌ చేశారు. ఉదయం 8 గంటల 35 నిమిశాలకు పాఠశాలను తనిఖీ చేసేందుకు కలెక్టర్‌ వచ్చారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. తరగతి గదిలో విద్యార్థుల విద్యాసామర్థ్యాన్ని తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు వేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగం గా చేపట్టిన పనులను పరిశీలించి, నిర్మాణానికి సంబంధించిన పలు సూచనలు, సలహాలను సంబంధిత ఇంజనీర్లకు సూచించారు. ఉదయం తొమ్మిది గంటలకు జరిగే ప్రార్థనకు హాజరుకావాల్సి ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మీ 9 గంటల 45 నిమిశాల వరకు కూడా రాకపోవడంతో సస్పెండ్‌ చేశారు. అలాగే ప్రార్థనకు ఆలస్యంగా హాజరైన ఉపాధ్యాయురాలు శారదకు మెమో జారీ చేశారు. ఈ మేరకు వారిద్దరికి ఉత్తర్వులు అందచేసినట్లు ఎంఈవో మంజులాదేవి తెలిపారు. కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీతో మండలంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు అప్రమత్తం అయ్యారు.

Updated Date - 2022-12-12T22:43:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising