ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూడిద లారీల నిలిపివేత

ABN, First Publish Date - 2022-01-29T04:50:23+05:30

కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి తెలంగాణ సరిహద్దుల మీదుగా వెళ్తున్న బూడిద లారీలు, టిప్పర్లు, ట్యాంకర్లను స్థానిక ఎస్‌ఐ నాగరాజు శనివారం నిలిపి వేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణ, జనవరి 28 : కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా కర్ణాటక పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నుంచి తెలంగాణ సరిహద్దుల మీదుగా వెళ్తున్న బూడిద లారీలు, టిప్పర్లు, ట్యాంకర్లను స్థానిక ఎస్‌ఐ నాగరాజు శనివారం నిలిపి వేశాడు. దీంతో విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీటీసీ కొంక ల్‌ వెంకటేష్‌ బీజేపీ నాయకులతో కలిసి జాతీయ రహదారిపై డ్రైవర్లతో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు దాదాపు వందల సంఖ్యలో లారీలను నిలిపివే శారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క పక్క రాత్రి పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నా పట్టించుకోని నాయకులు రోడ్డు ట్యాక్స్‌ చెల్లించి బూడిదను రవాణా చేస్తున్న లారీలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.

ఎస్‌ఐ నాగరాజును సస్పెండ్‌ చేయాలి

ఎస్‌ఐ నాగరాజును వెంటనే సస్పెండ్‌ చేయాలని నాగురావు నామాజీ పేర్కొన్నాడు. శుక్రవారం మండలంలోని గుడెబల్లూరు గ్రామ పంచాయతీ టైరోడ్డులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, మాజీ అధ్యక్షుడు రతంగ్‌ పాండురెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గురువారం నుంచి శుక్రవారం వరకు కర్ణాటక రాష్ట్రం కేపీసీఎల్‌ నుంచి బూడిద (ప్లేయశ్‌) తీసుకెళ్తున్న దాదాపు 500 లారీల ను టైరోడ్డు జాతీయ రహదారిపై నిలిపివేసిన మక్తల్‌ సీఐ, ఎస్‌ఐలను సస్పెండ్‌  చేయాలన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వాహనాలు నిలిపి లారీ యాజమానుల నుంచి ఏం ఆశిస్తున్నారని ప్రశ్నించారు. బూడిదను అక్రమంగా తరలిస్తే రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. కానీ ఎస్‌ఐకి ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన లారీలను రోడ్డుపై నిలబెడతారా, గత 30 సంవత్సరాల నుంచి బూడిద తరలిస్తున్నారని ఏం ఆశించి లారీలను నిలుపుతున్నారో ప్రజలకు తెలుసు అన్నారు.




Updated Date - 2022-01-29T04:50:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising