ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ABN, First Publish Date - 2022-05-24T04:33:38+05:30

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిం చాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు 

- ప్రజావాణికి 74 ఫిర్యాదులు 


మహబూబ్‌నగర్‌(కలెక్టరేట్‌), మే 23 : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిం చాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుం చి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదుల తో పాటు, ఆయా ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై సమీక్షించారు. అంతేగాక జూన్‌ రెండవ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడు కలపై మాట్లాడుతూ ఈ విడత రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు. వేడుకలకు ఎక్సైజ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ హాజరవుతారని,  ముందుగా ఆర్‌ అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ వద్దనున్న అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని, అనంతరం పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని వెల్లడించారు. కాగా, సోమవారం ప్రజావాణికి 74 ఫిర్యాదులు రాగా వాటిలో భూముల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, తదితర అంశాలకు సంబం ధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఎస్పీ వెంకటేశ్వర్లు రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై మా ట్లాడారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావు, జిల్లా అధికారులు హాజరయ్యారు. 

 ఈనెల 29న రైతు సదస్సు

 రైతులోకం ఫౌండేషన్‌, ఆస్క్‌ ఎడ్యుకేషనల్‌ సొ సైటీ, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అండ్‌ కోఆపరేటివ్‌ అగ్రిస్టోర్‌ సహకారంతో ఈనెల 29న జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో రైతు సదస్సు నిర్వహించ నుండడం అభినందనీయమని కలెక్టర్‌ వెంకట్రావు ఫౌండేషన్‌ సభ్యులను అభినందించారు. రైతులోకం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూపొంధించిన ‘మిద్దెతోటా - మిల్లెట్‌ - ప్రాకృతిక వ్యవసాయ సదస్సు’ కరప త్రాన్ని సోమవారం ఆయన తన చాంబర్‌లో ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో రసాయనాల ఎరువులు, పురుగుల మందుల వాడ కం పెరిగిందని, అటువంటి ఉత్పత్తులను తినడం వల్ల ఆరోగ్యం నాశనమై అనారోగ్యానికి గురవుతు న్నామని అందుకు ప్రత్యామ్నాయంగా ప్రాకృతిక వ్యవసాయాన్ని చేపట్టాలని ఆయన కోరారు. సభ్యు లు ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాంకిషన్‌, రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్యా మ్యూల్‌, కోశాధికారి జగపతిరావు, ఆర్గానిక్‌ కో-ఆప రేటివ్‌ స్టోర్‌ చైర్మన్‌ ముకుందరెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణ, అరుణ్‌రెడ్డి, రవి, తదితరులు కరపత్ర ఆవిష్కరణలో ఉన్నారు. 

Updated Date - 2022-05-24T04:33:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising