ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌ఫెక్షన్‌ కలిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2022-09-14T05:02:07+05:30

జనరల్‌ ఆసుపత్రిలో ఇన్‌ఫెక్షన్‌ కలిగే ప్రాంతాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ అన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్‌ రాంకిషన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 22 మంది సభ్యులతో ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీ ఏర్పాటు

- జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌

మహబూబ్‌నగర్‌(వైద్యవిభాగం), సెప్టెంబరు 13 : జనరల్‌ ఆసుపత్రిలో ఇన్‌ఫెక్షన్‌ కలిగే ప్రాంతాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ అన్నారు. మంగళవారం జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీ సమావేశాశంలో ఆయ న మాట్లాడుతూ ఆసుపత్రిలోని పోస్ట్‌ ఆపరేటివ్‌, ఐసీయూ, క్యాజువాలిటీ, ఆపరే షన్‌ థియేటర్‌, ఆర్‌ఐసీయూ వార్డులలో ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా కలిగే అవకాశం ఉందని, అందువలన ఆ ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా బయో మెడికల్‌ వేస్టేజీ సిక్రియేషన్‌ ప్రక్రియ సమర్థవంతంగా జరిగేలా చూడాలని, బయోమెడికల్‌ వేస్టేజీని సేకరించడంలో తగిన పద్దతులు పాటించాలన్నారు. హైరిస్క్‌ ఏరియాలలో ప్రతి మూడు నెలల కు ఒకసారి స్వాప్‌ కల్చర్‌ నిర్వహించాలని, ప్రతీ ఒక్కరు చేతులను పరిశు భ్రంగా కడుక్కోవాలని, పీపీఈ కిట్లను సరైన పద్దతిలో వినియోగించాలని సూ చించారు. ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించేందుకు 22 మందితో కూడిన ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కమిటీ ఇన్‌ ఫెక్షన్‌ నివారణలో తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆసుపత్రి డిప్యూటి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జీవన్‌, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ సిరాజుద్దిన్‌, డాక్టర్‌ వంశీకృష్ణ, డాక్టర్‌ వకులతో పాటు ఆయా విభాగాల హెచ్‌వోడీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-14T05:02:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising