ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో ఎస్పీ భవన సముదాయానికి శంకుస్థాపన

ABN, First Publish Date - 2022-12-02T00:02:46+05:30

త్వరలోనే నారాయణపేట జిల్లా నూతన ఎస్పీ కార్యాలయ భవన సముదాయం, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌, ధన్వాడ పీఎస్‌ నూతన భవనాల కోసం సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నట్లు పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు ఎండీ, అడిషనల్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు.

ఎస్పీ కార్యాలయ భవన సముదాయ నిర్మాణ స్థలాన్ని పరిశీలిస్తున్న అడిషనల్‌ డీజీ సంజయ్‌ కుమార్‌ జైన్‌ చిత్రంలో పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌ కొల్లేటి దామోదర్‌, ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అడిషనల్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌

- ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డితో కలిసి ఎస్పీ కార్యాలయ భవన సముదాయ నిర్మాణ స్థలం పరిశీలన

నారాయణపేట/ధన్వాడ, డిసెంబరు 1 : త్వరలోనే నారాయణపేట జిల్లా నూతన ఎస్పీ కార్యాలయ భవన సముదాయం, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌, ధన్వాడ పీఎస్‌ నూతన భవనాల కోసం సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నట్లు పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు ఎండీ, అడిషనల్‌ డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. గురువారం పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌ కొల్లేటి దామోదర్‌, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డితో స్థలాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని వల్లంపల్లి శివారు సర్వే నంబర్‌ 48లో 15 ఎకరాల స్థలాన్ని ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణం కోసం, జాజాపూర్‌ శివారు సర్వే నంబర్‌ 197లోని మూడెకరాల స్థలాన్ని రూరల్‌ పీఎస్‌ కోసం, ధన్వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఎకరా స్థలాన్ని పోలీస్‌ స్టేషన్‌ నూతన భవనం కోసం వారు రూట్‌ మ్యాప్స్‌తో పాటు స్థలాలను పరిశీలిం చారు. అంతకుముందు పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు ఎండీ, అడిషల్‌ డీజీ సంజయ్‌ కు మార్‌ జైన్‌, పోలీస్‌ హౌజింగ్‌ బోర్డు చైర్మన్‌ కొల్లేటి దామోదర్‌లను ఎమ్మెల్యే ఎస్‌ రా జేందర్‌రెడ్డి కలిసి పుష్ప గుచ్చాలు అందించారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్య నారాయణ, ఎంపీపీ శ్రీనివాస్‌, హౌజింగ్‌ బోర్డు అధికారులు సీఈ విజయ్‌, ఎస్‌ ఈ తులసిధర్‌, ఈఈ అబ్దుల్‌ కుద్దుస్‌, హుస్సెనీ, డీఈ బాలాజీ దాస్‌, ఏఈ సాయికిరణ్‌, సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, సీతయ్య, ఆర్‌ఐ కృష్ణయ్య, తహసీల్దార్‌ దానయ్య, ఎస్‌ఐలు సురేష్‌, జగదీశ్‌, రమేష్‌, అశోక్‌, వసంత, సర్వేయర్‌ మల్లేష్‌, ధన్వాడ సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి చాకలి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising