సాదాసీదాగా జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు
ABN, First Publish Date - 2022-08-05T05:16:46+05:30
ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పరిషత్ స్థాయీ సంఘం సమావేశాలు సాదాసీదాగా జరుగుతున్నాయి.
- తమకు ప్రాధాన్యం లేదని బహిష్కరించిన సభ్యులు
- పనుల పై చర్చించిన ఏడవ స్థాయీ సంఘం సమావేశం
మహబూబ్‌నగర్ టౌన్, ఆగస్టు 4 : ప్రస్తుతం జరుగుతున్న జిల్లా పరిషత్ స్థాయీ సంఘం సమావేశాలు సాదాసీదాగా జరుగుతున్నాయి. జిల్లా పరిషత్ సభ్యులు అందరు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో ఎలాంటి సీరియస్ చర్చలు లేకుండానే సమావేశాలు ముగుస్తున్నాయి. తమకు దళిత బంధుతో పాటు పలు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించాల్సిన ఆరవ స్థాయీ సంఘం సమావేశం సాంఘిక సంక్షేమం సభ్యులు బహిష్కరించారు. అనంతరం వారు ప్రభ్వుతం జడ్పీటీసీలకు కూడా ప్రభుత్వ పథకాలలో తగు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైర్పర్సన్ చాంబర్లో నిర్వహించిన ఏడవ స్థాయీ సంఘం సమావేశానికి జడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో నిర్మాణ పనుల గురించి, పనులు ఏ దిశకు వచ్చింది, పనుల్లో ఎంత పురోగతి ఉన్నది సభ్యులు నవాబ్‌పేటకు చెందిన రవీందర్‌రెడ్డి, గండీడ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇచ్చా రు. పనులు పెండింగ్‌లో ఉంచకుండా వేగం పెంచాలని చైర్పర్సన్ కోరారు. పనులు ఎందుకు ఆలస్యం అవుతుందో తెలపాలని కోరారు. కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు పాడైపోయాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. మధ్యాహ్నం జరిగిన మొదటి స్థాయీ సంఘం సమావేశంలో ఆర్థిక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి ఇబ్బందులు ఉన్న పనుల గురించి ఆరా తీశారు. పనులు వెంటనే పూర్తి చేయాలని, బడ్జెట్ సరిపోకపోతే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T05:16:46+05:30 IST