ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-28T04:42:50+05:30

గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకుని కాపర్లు లబ్ధిపొందాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు.

కురువ యాదవులకు గొర్రెల పంపిణీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి 

- కొల్లంపల్లిలో 24 యూనిట్ల గొర్రెలు పంపిణీ

నారాయణపేట రూరల్‌, మే 27 : గొర్రెల యూనిట్లను సద్వినియోగం చేసుకుని కాపర్లు లబ్ధిపొందాలని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కొల్లంపల్లి గ్రామంలో కురువ యాదవులకు 24 యూనిట్ల గొర్రెలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం గొర్రెలు అందించి కాపరుల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు అంజలి, సర్పంచ్‌ సాయిరెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ తాజుద్దీన్‌, సిద్దివడెప్ప, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వేపూరి రాములు, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పశువైద్యాధికారి ఆర్‌.సురేఖ, మండల పశువైద్యాధికారులు అనిరుద్దాచార్య, శ్రీనివాస్‌, నాయకులు రాంమోహన్‌, రామకృష్ణ, ఆశప్ప, నర్సప్ప పాల్గొన్నారు. అంతకుముందు మండలంలోని కోటకొండ గ్రామానికి చెందిన కావలి కన్కప్పకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.3.50 లక్షల ఎస్‌వోసీ పత్రాన్ని క్యాంపు కార్యాలయంలో కన్కప్ప కుమారుడు కావలి వెంకటేశ్‌కు అందజేశారు.

గొర్రెల పెంపకం దారుల వినతి

నారాయణపేట టౌన్‌ : నారాయణపేట గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఆధ్వర్యంలో సహకార సంఘానికి రెండెకరాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆ సంఘం నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే ఎస్‌ఆ ర్‌రెడ్డికి వినతి పత్రం అందించారు. జిల్లాలో 218 సహకార సంఘాలు ఉన్నాయని, ప్రతీ గ్రామంలో గొర్రెలను మేపేందుకు ప్రభుత్వ భూమి ఉన్నచోట ఐదెకరాల భూమిని కేటాయించేలా చర్యలు తీసుకో వాలని వినతిలో కోరారు. గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నాయకులు నాగరాజు, వెంకటయ్య, బస్వరాజ్‌, సత్యం, మోహన్‌ ఉన్నారు.

అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరికలు

నారాయణపేట : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలకు ఆకర్శితులై పలువురు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే ఎస్‌.రాజేం దర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కొల్లంపల్లి గ్రామంలో కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన 50మంది ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - 2022-05-28T04:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising