దుంపాయికుంటలో గుడిసెల ఏర్పాటు
ABN, First Publish Date - 2022-12-16T23:03:43+05:30
అమరచింత మునిసిపాలిటీలోని దుంపాయికుంటలో శాశ్వతం గా నివాసం ఉండేందుకు గాను గుడిసెల నిర్మాణ పనులను చేపట్టారు.
అమరచింత, డిసెంబరు 16: అమరచింత మునిసిపాలిటీలోని దుంపాయికుంటలో శాశ్వతం గా నివాసం ఉండేందుకు గాను గుడిసెల నిర్మాణ పనులను చేపట్టారు. శుక్రవారం సీపీఎం ఆధ్వ ర్యంలో లబ్ధిదారులకు 60 గజాల భూమిలో గుడి సెలు వేసేందుకు హద్దులను ఏర్పాటు చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ హాజరై లబ్ధిదారులతో మమేకమై నిర్మాణ పనుల్లో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి లబ్ధిదారుల కు తక్షణమే ఇళ్ల స్థలాల హద్దులను చూపించి, ఆ స్థలంలో డబుల్ బెడ్‌రూముల నిర్మాణం చేప ట్టాలని డిమాండ్ చేశారు. అనేక ఏండ్లుగా నిరు పేదలు ఇళ్లు లేక అనేక ఇబ్బందులకు గురవుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 25 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూమిలో లబ్ధిదారులకు ఇచ్చిన ప్లాట్ల లో వెంటనే హద్దులను చూపించాలని కోరారు. కాగా, ఇళ్లు లేని నిరుపేద లు అధిక సంఖ్యలో దుంపాయికుంట ప్రాంతానికి చేరుకొని సంబంధిత స్థలంలో స్థిరంగా నివాసం ఉండేందుకు గుడిసెల నిర్మాణ పనులను చేపట్టారు. ప్రభుత్వ అధికారు లు ఇప్పటికైనా స్పందించి వెంటనే లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల హద్దుల ఏర్పాటుకు కృషి చేయాలని పురపాలక వైస్ చైర్మన్ జీఎస్.గోపి డిమాండ్ చే శారు. సీపీఎం నాయకులు ఆర్‌ఎన్.రమేష్, వెంక టేష్, బుచ్చన్న, అనంతమ్మ తదితరులున్నారు.
Updated Date - 2022-12-16T23:03:44+05:30 IST