ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-11-24T23:27:12+05:30

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, నవంబరు 24 : డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కేటాయింపునకు లబ్ధిదారుల ఎంపిక త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌, హౌసింగ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సునీల్‌శర్మ గురువారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. 2023 జనవరి 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉంటే లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. మిగిలిన అర్హుల వివరాలతో వెయిటింగ్‌ జాబితాను తయారు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ అపూర్వ చౌహాన్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:27:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising