ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజ్ఞాన శాస్త్రమే సమాజ పురోగతికి మూలం

ABN, First Publish Date - 2022-11-27T23:26:49+05:30

సమాజ పురోగతికి విజ్ఞాన శాస్త్రమే మూలమని గద్వాల మండల విద్యా శాఖాధికారి జి. సురేష్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల టౌన్‌, నవంబరు 27 : సమాజ పురోగతికి విజ్ఞాన శాస్త్రమే మూలమని గద్వాల మండల విద్యా శాఖాధికారి జి. సురేష్‌ అన్నారు. విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంచడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆదివారం పట్టణంలోని ఎంఏఎల్‌డీ కళాశాలలో చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించి, రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో పాల్గొన్న జిల్లా సెక్టోరియల్‌ అధికారి ఎస్తేరురాణి, విద్యార్థుల్లో ప్రాథమి క స్థాయి నుంచే సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచడం అభినం దనీయమన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర సామాజిక న్యాయ కన్వీనర్‌ వెంకటరమణ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు అన్న స్ఫూర్తితో విద్యా ర్థుల్లో పరిశోధన సామర్థ్యాన్ని పెంచేందుకు చె కుముకి పోటీలు ప్రతీ యేటా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. వే దిక జిల్లా కన్వీనర్‌ ఎల్లస్వామి మాట్లాడుతూ జనవి జ్ఞాన వేదిక నిర్వహించే పోటీలను అవకాశంగా మల చుకొని విద్యార్థులు సైంటిఫిక్‌ టెంపర్‌ను అలవరచుకో వాలని సూచించారు. విద్యార్థుల్లో మూఢనమ్మకాలను నిర్మూలించడం, సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంచడంతో పాటు శాస్ర్తీయ తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా మూడు దశాబ్దాలుగా వేదిక కృషి చేస్తున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో గె లుపొంది రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ పో టీలకు ఎంపికైన విద్యార్థులకు మెమోంటోలు, ప్రశం సాపత్రాలు అందజేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వి ద్యార్థులు సాయిరాం, చంద్రశేఖర్‌ రెడ్డి, రాఘవేంద్ర (జడ్పీహెచ్‌ఎస్‌, నందిన్నె) ఉపేందర్‌, ఇందు, నరసింహులు, (జడ్పీహెచ్‌ఎస్‌, చింతలకుంట), సాయివిహార్‌, సాహితీ, ఉల్పత్‌జహాన్‌ (కాకతీయ టెక్నో హైస్కూల్‌ గద్వాల) ఉన్నారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు పరంజ్యోతి, తారానాథ్‌, రుషిరాజు, జానకమ్మ, నాగరాజు, రామన్న, ఐలప్ప, అరవింద్‌, యువరాజ్‌, జాకీర్‌, జయరాజు ఉన్నారు.

Updated Date - 2022-11-27T23:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising