ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పాఠశాలలు

ABN, First Publish Date - 2022-07-19T05:07:48+05:30

ప్రత్యేక తెలంగాణలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు రాఘవ, వెంకటేష్‌ ఆరోపించారు.

పోస్టర్‌ విడుదల చేస్తున్న వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తకోట, జూలై 18: ప్రత్యేక తెలంగాణలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నాయకులు రాఘవ, వెంకటేష్‌ ఆరోపించారు. విద్యారంగంపై రాష్ట్ర ప్ర భుత్వం ఆవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసి స్తూ 20వ తేదీన చేపడుతున్న విద్యాసంస్థల బంద్‌కు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను సోమ వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణలో భవనాల కొరత, టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టుల నియామ కాలు చేపట్టక పోవడం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలం చెందారన్నారు. బాసర ఐఐఐటీ కళాశాలలో సమస్యలు పరిష్కారం చేయడం లేదన్నారు. యూనివర్శిటీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాఠశాలలు నీటిలో ముని గి ప్రభుత్వ డొల్లతనం బయటపడిందన్నారు. పాఠశాలలు ప్రారంభం అయి రెండు నెలలు గడుస్తున్నా పాఠ్యపుస్తాకాలు, దుస్తులు పంపిణీ చేయలేని స్థితిలో ఉండడం దారుణమని విమ ర్శించారు.  కార్యక్రమంలో హరీష్‌, శివ, ప్రదీప్‌, శంకర్‌, తేజ, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు. 

 పెబ్బేరులో..

పెబ్బేరు : విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేపు చేపట్టనున్న విద్యా సంస్థల బంద్‌ను విజయవంతం చేయాల ని పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. సోమవారం పెబ్బేరు స్వర్ణభారతి పారమెడికల్‌ కళాశాల ఆవరణలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో గణేష్‌, అది, అంజి, హరీష్‌, శివశంకర్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-19T05:07:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising