ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-05-19T05:14:29+05:30

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని డీటీఎప్‌ జనరల్‌ సెక్రటరీ వెంకటరమణ డిమాండ్‌ చేశారు.

ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గద్వాల క్రైం, మే 18 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని డీటీఎప్‌ జనరల్‌ సెక్రటరీ వెంకటరమణ  డిమాండ్‌ చేశారు. బుధవారం  ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టరేట్‌ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా డీటీఎఫ్‌ జనరల్‌ సెక్రటరీ వెంకటరమణ మాట్లాడుతూ జీవో 317 అమలు కారణంగా ఏర్పడిన సీనియారిటి, స్పెషల్‌ క్యాటగిరి, భార్యాభర్తల సమస్యలపై పెండింగ్‌లో ఉన్న అప్పిల్స్‌ను వెంటనే పరిష్కరించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు, కుటుంబాలకు నగదు రహిత వైద్యం అందించడానికి ఈహెచ్‌ఎఫ్‌ కోసం వేతనాల్లో 2శాతం కోత విధించడానికి వీలు లేదని, ఈహెచ్‌ఎస్‌ సక్రమ అమలుకు ఉద్యోగ, ఉపాధ్యాల సంఘాలతో సమావేశం నిర్వహించాలన్నారు. ప్రతీ నెల మొదటి తేదీన వేతనాలు విడుదలు చేయాలని డిమాండ్‌ చేశారు.  అనంతరరం కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రాన్ని సమర్పించారు. సంఘాల నాయకులు ప్రవీణ్‌కుమార్‌, యాకోబ్‌, తిమ్మప్ప తదితరులున్నారు.

Updated Date - 2022-05-19T05:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising