ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక అనుమతి రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-12-15T23:54:12+05:30

ఇసుక తరలింపు విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య చోటు చేసుకున్న సంఘటన ఉద్రిక్తంగా మారింది.

వాగ్వాదానికి దిగిన ఇరు పార్టీల కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాంగ్రెస్‌ ధర్నా, అభివృద్ధి పనులకే అని బీఆర్‌ఎస్‌ ప్రతి ధర్నా

- ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం

మద్దూర్‌, డిసెంబరు 15 : ఇసుక తరలింపు విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ల మధ్య చోటు చేసుకున్న సంఘటన ఉద్రిక్తంగా మారింది. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం లింగాల్‌చేడ్‌, నందిగామ వాగుల నుంచి వికారాబాద్‌, హైదరాబాద్‌కు ఇసుక తరలింపునకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కొత్తపల్లి చౌరస్తాలో గురువారం ధర్నా చేపట్టారు. టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించడంతో వాగులన్నీ ఖాళీ కావడంతో భూగర్భ జలాలు అడగంటి కరువు ప్రాంతంగా మారుతోందని కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పరిసర మండలాలకు మాత్రమే ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపునకు అనుమతులివ్వాలని, డబుల్‌ బెడ్‌రూం పేర ఇతర ప్రాంతాలకు ఇసుక తరలింపునకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని రోడ్డుపై బైఠాయించారు. ఇందుకు ప్రతి స్పందనగా ప్రభుత్వం అభివృద్ధి పనులకే ఇసుకను తలరించేందుకు అనుమతి ఇచ్చిందని, కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపనలు వాస్తవం కాదని, ఇసుక తరిలింపును అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్‌ పార్టీ సైతం చౌరస్తాలో ప్రతి ధర్నాకు దిగింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాల వారిని అదుపు చేయడంతో పరిస్థితి సద్దుమనిగింది. ఇరు పార్టీల నాయకులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు ఆరోపనలు చేసుకున్నారు.

Updated Date - 2022-12-15T23:54:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising