రైతుల ఆనందం కోసమే సంబురాలు
ABN, First Publish Date - 2022-12-16T23:21:25+05:30
రైతుల ఆనందం కోసమే సంబురాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ రాజారెడ్డి తెలిపారు.
ఎంపీపీ రాజారెడ్డి
మల్దకల్, డిసెంబరు 16 : రైతుల ఆనందం కోసమే సంబురాలను నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ రాజారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శుక్రవారం ఎద్దుల బల ప్రదర్శన పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచు యాకోబు, ఉపసర్పంచు ఎస్.మల్దకల్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటన్న, కోఆప్షన్ మెంబర్ హైదర్పాషా, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మహేష్, నాయకులు చక్రధర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జయమ్మ, నరేందర్, మధు, ప్రకాష్, ప్రభాకర్, శేషాద్రినాయుడు పాల్గొన్నారు.
ఆరు పళ్ల విభాగం పోటీలో విజేతలు వీరే...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఆరు పళ్ల విభాగం బలప్రదర్శన పోటీల్లో జూటూరు రామకృష్ణారెడ్డి, రఘురెడ్డి ఎద్దులు 4,461 ఫీట్లు బండను లాగి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. సుధీర్‌కుమార్‌రెడ్డి, బీరం సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డికి చెందిన ఎద్దులు 4,412 ఫీట్లు లాగి రెండో స్థానంలో నిలిచాయి. నాగూర్ రాజశేఖర్‌రెడ్డి, కర్నూలు జిల్లాకు చెందిన బాబర్ ఎద్దులు 4,390, గట్టు మండలం కుర్వకర్రెప్పకు చెందిన ఎద్దులు 4,337 అడుగులు, గద్వా ల జిల్లా రాయపురం రామచంద్రారెడ్డ్డి ఎద్దులు 4,337 ఫీట్లు బండను లాగి మూడు, నాలుగు, ఐదవ స్థానాలు దక్కించుకున్నాయి. విజేతలకు వరు సగా రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేల నగదు బహుమతులను అందించారు.
వలంటీర్ల సేవలు అభినందనీయం
వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో మల్దకల్ జూనియర్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వలంటీర్లు అందిస్తున్న సేవలు అమోఘమని నాయకులు, భక్తులు అభినందించారు. దాదాపు 50 మంది వలంటీర్లు భక్తులకు సేవలు అందిస్తున్నారు. ప్రిన్సిపాల్ రమేష్‌లింగం, ప్రోగ్రాం అధికారి రామాంజనేయులు, నర్సింహులు వారి సేవలను పర్యవేక్షించారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యశ్చంద్రారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు వారిని అభినందించారు.
Updated Date - 2022-12-16T23:21:27+05:30 IST