ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-18T05:48:10+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, మన ఊరు.. మన బడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పల్లె ప్రగతి సమీక్షలో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి

భూత్పూర్‌, మే 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, మన ఊరు.. మన బడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరి షత్‌ కార్యాలయంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పల్లె ప్రగతి, మన ఊరు... మన బడి కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సద స్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభభుత్వం పేద ప్రజల కోసం ఎనలేని కృషి చేస్తుందని, ఇందులో భాగంగా మన ఊరు.. మన బడి, పల్లె ప్రగతి పథకాలు చాలా అద్భుతమైనవని ఆమే కొనియాడారు. గ్రామాల్లో ప్రజాప్రతినిఽధులు ప్రభుత్వ పథకాలను అమలు పర్చడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జరిగే మన ఊరు..మన బడి, పల్లెప్రగతి కార్యక్రమాలను ప్రతీ ఒక్కరు హాజరై ఈ పథకంప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సాయిబాబా, ఎంపీడీవో మున్ని, వైస్‌ ఎంపీపీ నరేష్‌గౌడ్‌, ఎంపీవో విజయ్‌కుమార్‌, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising