ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతి సమైక్యతను చాటేందుకు పరుగు

ABN, First Publish Date - 2022-12-12T23:20:22+05:30

దేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నాయని, జాతీయ సమైక్యతను చాటేందుకు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు ఎన్‌సీసీ సమైక్యతా జ్యోతి పరుగు యాత్ర నిర్వహిస్తున్నానని కల్నల్‌ క్రిషన్‌సింగ్‌బద్వాల్‌ తెలిపారు.

జాతీయ రహదారిపై పరుగు తీస్తున్న కల్నల్‌ క్రిషన్‌సింగ్‌ బద్వార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జానంపేటలో కల్నల్‌ బద్వార్‌కు ఘన స్వాగతం

మూసాపేట, డిసెంబరు 12 : దేశంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నాయని, జాతీయ సమైక్యతను చాటేందుకు కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు ఎన్‌సీసీ సమైక్యతా జ్యోతి పరుగు యాత్ర నిర్వహిస్తున్నానని కల్నల్‌ క్రిషన్‌సింగ్‌బద్వాల్‌ తెలిపారు. 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్య్ర వేడుకల ను పురస్కరించుకొని నవంబరు 20న చేపట్టిన పరుగు యాత్ర సోమవారం మూసాపేట మండలం జానంపేటకు చేరుకున్నది. ఈ సందర్భంగా యువకులు, విద్యార్థులు పరు గు యాత్రకు జాతీయ జెండాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చేపట్టిన పరుగు యాత్ర రోజుకు 50 కిలో మీటర్ల పొడవున 60 రోజుల్లో మూడు వేల కిలోమీటర్లు పరుగు యాత్ర చేసి జనవరి 18న ఢిల్లీకి చేరుకుంటుం దన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి గణతంత్ర వేడుకల్లో పాల్గొని యాత్రను ముగిస్తానని చెప్పారు. యాత్ర ఇప్పటి వరకు 1150 కిలోమీటర్లు చేశానన్నారు. దేశంలోని యువత సమున్నత లక్ష్యం నిర్దేశించుకొని సాధన కోసం జీవితాన్ని కొనసాగించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. యువత తమ లక్ష్యాలను అధికమిస్తూనే దేశ సేవకు అంకితం కావాలన్నారు. కార్యక్రమంలో బెటాలియన్‌ కమా డింగ్‌ అధికారులు, ఎన్‌సీసీ అధికారులు, వైద్య సిబ్బంది, ఆయా గ్రామాల యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising