ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉంద్యాల పంప్‌ హౌస్‌ నుంచి నీటి విడుదల

ABN, First Publish Date - 2022-06-30T05:06:17+05:30

మండలంలోని ఉంద్యాల గ్రామ సమీపంలో గల ఫేజ్‌ వన్‌ పంప్‌హౌస్‌ వద్ద బుధవారం మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టులోకి కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు.

నీటిని విడుదల చేస్తున్న మక్తల్‌ ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌ పర్సన్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నచింతకుంట, జూన్‌ 29 : మండలంలోని ఉంద్యాల గ్రామ సమీపంలో గల ఫేజ్‌ వన్‌ పంప్‌హౌస్‌ వద్ద బుధవారం మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ స్వర్ణా సుధాకర్‌రెడ్డి కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టులోకి కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. పంప్‌ హౌస్‌ వద్ద వారు లాంఛనంగా పూజలు నిర్వహించిన అనంతరం పూలు చల్లి ఒక మోటార్‌కు సంబంధించిన నీటిని పర్దీపూర్‌ రిజర్వాయర్‌లోకి వదిలారు. రిజర్వాయర్‌లో పూర్తిగా నిండిన అనంతరం ఫేజ్‌-2 తీలేరులోని పంప్‌ హౌస్‌ వద్ద నుంచి నీరు కోయిల్‌ సాగర్‌లోకి ప్రవేశించనుంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టు చైర్మన్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు కరుణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ నెల్సన్‌, టీఆర్‌ఎస్‌ మండల నాయకులు వట్టెం రాము, వజీర్‌ బాబు, ఎంకుల్‌, రామలింగారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T05:06:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising