ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు చేరుతారు

ABN, First Publish Date - 2022-05-27T05:19:20+05:30

కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు చేరుతారని ప్రభు త్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడి యంలో పోలీసు అభ్యర్థులకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించారు.

సాధన చేస్తున్న ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

అచ్చంపేటటౌన్‌,మే 26: కష్టపడితేనే ఉన్నత శిఖరాలకు చేరుతారని ప్రభు త్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్టీఆర్‌ స్టేడి యంలో పోలీసు అభ్యర్థులకు ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాల్లో ఆనందం నింప డానికే ఉచిత కోచింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువతీ యువ కులు ప్రతీ రోజు స్టేడియంలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌లో మంచి ఫలితాలు సాధిం చేందుకు సాధన చేయాలన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని యువతీ యువతులు మంచి అవకాశాలు పొందాలన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు శిక్షణ తీసుకుంటున్న యువతి, యువకుల కోసం ఎన్టీఆర్‌ స్టేడి యంలో ఈవెంట్లలో రాణించే విధంగా నిపుణులైన కోచ్‌లను హైదరాబాద్‌ నుం చి తీసుకువచ్చి వారి సలహాలు సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్‌డీవో పాండు నాయక్‌, కోచ్‌లు, నాయకులు పోలీస్‌ అభ్యర్థులు పాల్గొన్నారు. మండల పరిధిలోని కేిసీ తండాలోని హనుమాన్‌ ఆయలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Updated Date - 2022-05-27T05:19:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising