ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు

ABN, First Publish Date - 2022-09-27T05:17:30+05:30

జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లు, ఫార్మసీలపై డీఎంహెచ్‌వో చందూనాయక్‌ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించారు.

ప్రైవేట్‌ క్లినిక్‌ వైద్యుడితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- పలు ఆసుపత్రులకు నోటీసులు

- డీఎంహెచ్‌వో చందూనాయక్‌

గద్వాల క్రైం, సెప్టెంబరు 26 : జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, ల్యాబ్‌లు, ఫార్మసీలపై డీఎంహెచ్‌వో చందూనాయక్‌ఆధ్వర్యంలో సోమవారం దాడులు నిర్వహించారు. లైసెన్స్‌ లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ సంద ర్భంగా డీఎం హెచ్‌వో మాట్లాడుతూ ఆర్‌ఎంపీలు నిబంధనలకు విరుద్ధంగా చికిత్సలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న కొందరు క్లినిక్‌లను మూసివేసు కున్నారు. వాటిపై మరోసారి తనిఖీ చేస్తామని డీఎంహెచ్‌వో తెలిపారు. గద్వాల పట్టణంలోని బాబా సాహెబ్‌ ఆసుపత్రికి అనుమతి లేనందున షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఆర్‌ఎంపీ విజయ్‌కుమార్‌ ఆసుపత్రిలో సెలైన్‌ బాటిళ్లు, ఐవీ సెట్లు ఉండడంతో సీజ్‌ చేశారు. దాడులలో ఎన్‌సీడీ కో-ఆర్డినేటర్‌ శ్యాంసుందర్‌, సీసీ వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.


రెండు ఆసుపత్రులకు నోటీసులు

అయిజ : పట్టణంలోని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో జిల్లా వైద్యాధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బాలాజీ నర్సింగ్‌ హోంను అధికారులు తనిఖీ చేయగా, వైద్యులు, నర్సులు, సిబ్బంది ఎవరూ లేకపోవడం, సరైన ధ్రువపత్రాలు చూపించకపోవడంతో అధికారులు సీజ్‌చేశారు. స్రవంతి, పుష్ప, సత్యనారాయణ ఆసుపత్రులకు ఫైర్‌ సేఫ్టీ లేకపోవటం, సరైన సిబ్బంది లేకపో వడంతో నోటీసులు ఇచ్చారు. పుష్ప నర్సింగ్‌ ఆస్ప త్రి నిర్వాహణ అనుమతి అక్టోబర్‌ రెండున ముగియనుందని అధికారులు తెలిపారు. ఆసుప త్రికి బోర్డు కూడా లేదని గుర్తించారు. సన్‌రైజ్‌ ఆస్పత్రిని కూడా తనఖీ చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపముఖ్య అధికారి సిద్ధప్ప, డాక్టర్లు శశికళ, ఇర్షాద్‌, రవికుమార్‌, సూపర్‌వైజర్‌ నర్సింహులు, హెల్త్‌ అసి స్టెంట్‌ గోవిందరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-27T05:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising