ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించాలి

ABN, First Publish Date - 2022-06-26T05:02:50+05:30

ప్రభుత్వం తాగునీటి కోసం కోట్ల రూపాయలతో మిషన్‌ భగీరథ పథకా న్ని ఏర్పాటుచేస్తే కొంతమంది అధికారుల నిర్ల క్ష్యంతో తాగునీటి సరఫరాలో లోపాలు జరుగుతు న్నాయని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మంచినీటి పథకాలను ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు తనిఖీ చేయాలి

సర్వసభ్య సమావేశంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి 


శ్రీరంగాపురం, జూన్‌ 25: ప్రభుత్వం తాగునీటి కోసం కోట్ల రూపాయలతో మిషన్‌ భగీరథ పథకా న్ని ఏర్పాటుచేస్తే కొంతమంది అధికారుల నిర్ల క్ష్యంతో తాగునీటి సరఫరాలో లోపాలు జరుగుతు న్నాయని జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యా లయ సమావేశమందిరంలో ఎంపీపీ గాయత్రి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. తాగునీటిని శుద్ధి చేయడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని సభ దృష్టికి పలువురు సభ్యులు తీసుకురావడంతో జడ్పీ చైర్మ న్‌ స్పందించారు. సమావేశ వేదిక పైనుంచే ఆ యన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో మాట్లాడారు. మంచినీటి పథకాలను ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు తనిఖీలు చేయాలని చెప్పారు. జడ్పీ టీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ మండల మహిళా సమాఖ్యలో గోల్‌మాల్‌, అక్ర మాలు జరుగుతున్నాయని, పథకాలను మహిళా సంఘాలకు తెలపకుండా పనిచేస్తున్నారని, వరి కొనుగోలు కేంద్రాల్లో వచ్చిన కమీషన్‌ లెక్కలు, మిగతా లెక్కలు బయట పెట్టాలన్నారు. కొంత మంది మగవారు మహిళా సమాఖ్యలో జోక్యం చేసుకుని ఏళ్లతరబడి పనిచేస్తున్న కిందిస్థాయి మహిళా ఉద్యోగులను అకారణంగా తొలగించారని ఆరోపించారు. మండలంలో జూరాల కాలువలకు గండ్లు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, భీమా, జూరాల కాలువలకు పూడిక తీయ డం లేదని ఆరోపించారు. సమావేశంలో సర్పం చులు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు, మంజుల, ఎంపీటీసీ సభ్యులు ఎల్లస్వామియాదవ్‌, మహే శ్వర్‌రెడ్డి, సీడీపీవో లక్ష్మమ్మ, ఎంపీవో రోజా, పర మేశ్వర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.     

Updated Date - 2022-06-26T05:02:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising