సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ABN, First Publish Date - 2022-10-18T04:18:33+05:30
అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు.
నారాయణపేట టౌన్, అక్టోబరు 17 : అధికారులు ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ పద్మజా రాణితో కలిసి ప్రజల నుంచి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నమ్మకంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వ స్తారని వారి ఫిర్యాదులను జిల్లా అధికారులు సత్వరమే పరిష్కరించాలన్నారు. పరిష్కరించనివి ఉంటే అక్కడే ఫిర్యాదుదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రజావాణిలో 18 ఫిర్యాదులు వచ్చాయని వాటి పరిష్కారానికి సంబంధిత శాఖలకు పంపనున్నట్లు ఆయన తెలిపారు.
అంగన్‌వాడీలో హాజరుశాతం పెంచాలి
అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లల హాజరు వంద శాతం పెంచాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ శిశు సం క్షేమ శాఖ పనితీరుపై సమీక్షించి మాట్లాడారు. అంగన్‌వాడీలో నమోదైన పిల్లల సంఖ్య కంటే తక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు గుర్తించామని పక్షం రోజుల్లో ఈ పరిస్థితి మారాలని వందశాతం పిల్లలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాలిచ్చే తల్లులు సైతం కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తీసు కెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. చిన్నారుల్లో బరువులు, ఎత్తులు సరిగ్గా తెలియాలని, స్యామ్ మ్యామ్‌లో లేకుండా ఉండేందుకు తప్పుడు బరువులు నమోదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ బుధవారం పది నిమిషాలు కేంద్రాల్లో స్యామ్ మ్యామ్ పిల్లల తల్లులతో సమావేశమై వారికి పిల్లల పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులతో పాటు బడి బయటి పిల్లల జాబితా తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. బీసీ సంక్షేమ అధికారి వేణుగోపాల్, డీసీపీవో కుసుమలత, సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:18:33+05:30 IST