ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలిసెట్‌కు సర్వం సిద్ధం

ABN, First Publish Date - 2022-06-30T04:46:00+05:30

తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాలిసెట్‌-2022కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నారు. 44 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11,815 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

మహబూబ్‌నగర్‌లోని ఎన్‌టీఆర్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న పరిశీలకుడు నాగరాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

హాజరుకానున్న 11,815 మంది విద్యార్థులు

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు: కోఆర్డినేటర్‌ నాగరాజు


మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, జూన్‌ 29: తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాలిసెట్‌-2022కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు నిర్వహించనున్నారు. 44 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 11,815 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మహబూబ్‌నగర్‌లో తొమ్మిది కేంద్రాలను ఏర్పాటు చేయగా, 3,526 మంది పరీక్ష రాయనున్నారు. వనపర్తిలో 2,522, జోగులాంబ గద్వాల జిల్లాలో 1,882, నాగర్‌కర్నూల్‌లో 2,950, నారాయణపేటలో 935 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను కోఆర్డినేటర్‌ నాగరాజు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు పరీక్షకు వచ్చే ముందు హాల్‌ టికెట్‌, హెచ్‌బీ పెన్సిల్‌, బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌, ప్యాడ్‌లు తప్పని సరిగా తెచ్చుకోవాలని చూచించారు. కేంద్రాల్లోకి ఎలకా్ట్రనిక్‌ వస్తువులను తేవొద్దని, పరీక్ష మధ్యలో ఎవరినీ బయటకు పంపించరని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్క్‌ ధరించాలని తెలిపారు.

Updated Date - 2022-06-30T04:46:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising