ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీపీ కార్మికులకు పీఆర్సీ అమలు చేయాలి

ABN, First Publish Date - 2022-01-26T05:32:42+05:30

గ్రామ పంచాయతీ కార్మికులకు 30శాతం పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని కోటకొండ సర్పంచ్‌ విజయలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు.

కోటకొండ సర్పంచు విజయలక్ష్మి వినతి పత్రం అందజేస్తున్న పంచాయతీ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట రూరల్‌, జనవరి 25 : గ్రామ పంచాయతీ కార్మికులకు 30శాతం పీఆర్సీ అమలు చేయాలని కోరుతూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని కోటకొండ సర్పంచ్‌ విజయలక్ష్మీకి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎదురింటి నర్సిములు మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు తగిన వసతులు కల్పించాలన్నారు. పది లక్షల బీమా వర్తింపచేయాలన్నారు. కరోనా బీమా కింద రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్‌, ఈఎస్‌ఐ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నరసింహ, రామ్‌చందర్‌, అంజిలప్ప, కిష్టప్ప, సాయిలు, చంద్రు, భారతమ్మ, ఖాదరమ్మ తదితరులు పాల్గొన్నారు.

దామరగిద్ద : గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నెంబర్‌ 60 ప్రకారం పీఆర్సీని అమలు చేయాలని కోరుతూ మంగళవారం మండలంలోని విఠలా పూర్‌లో పంచాయతీ కార్మికులు సర్పంచ్‌ నిర్మలకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, పార్టుటైం, పుల్‌టైం కాంటింజెంట్‌ సిబ్బందితో పాటు స్కీం వర్కర్లకు కొత్తగా 30శాతం పీఆర్సీని అమలు చేసిందన్నారు. జీవో నెంబ ర్‌ 60 ప్రకారం పంచాయతీ వర్కర్లకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలన్నారు. మల్టీపర్పస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి పంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు.  కార్మికు లు అంజిలప్ప, హన్మంతు, మాదవులు, రఫీ ఉన్నారు. 

Updated Date - 2022-01-26T05:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising