ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటిన మొక్కలను కాపాడాలి

ABN, First Publish Date - 2022-12-15T23:57:03+05:30

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో నాటిన 30 లక్షల మొక్కలను కాపాడుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ఆంజేయులు గౌడ్‌ అధికారులను ఆదేశించారు.

స్థాయీ సంఘాల సమావేశంలో పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ వనజ ఆంజనేయులు గౌడ్‌

- ప్రారంభమైన స్థాయీ సంఘాల సమావేశాలు

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 15 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో నాటిన 30 లక్షల మొక్కలను కాపాడుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ఆంజేయులు గౌడ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశాలు ప్రారంభం కాగా, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన రెండో (గ్రామీణ అభివృద్ధి) స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు, నాల్గో (విద్య, వైద్యం) స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు కొనసాగాయి. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ నర్సరీల్లో షెడ్‌నెట్స్‌ లేవని, కంచె సరిగ్గా లేదని, నర్సరీల నిర్వాహణ సరిగ్గా లేదని, అధికారులపై మండిపడ్డారు. బృహత్‌ ప్రకృతి వనాలు ప్రతీ మండలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలన్నారు. పెద్దలు, వయోవృద్ధులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అదికారులను కోరారు. ఇప్పటికే జిల్లాలో గుర్తించిన 336 తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో పూర్తి కానీ 16 పూర్తి చేయాలని, మిషన్‌ భగీరథలో మిగిలిన ట్యాంకులను ఈనెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ‘మన ఊరు - మన బడి’లో భాగంగా మొదటి విడతలో 174 పాఠశాలలో రూ.30 లక్షల పనులను ఈనెల వరకు పూర్తి చేయాలని సూచించారు. కంటి వెలుగుకు సంబంధించి యాక్షన్‌ ప్లాన్‌ను ఆమె అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీల్లో ఓపీని పెంచాలని, పల్లె దవాఖానాల్లో మౌలిక వసతులు కల్పించి వాడుకలోకి తీసుకరావాలన్నారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లకు వచ్చే రోగులకు చికిత్సలు అందించాలన్నారు. సమావేశంలో జడ్పీ కోఆప్షన్‌ తాజుద్దీన్‌, జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య పాల్గొన్నారు. అదే విధంగా ఐదో స్థాయి (స్త్రీ మరియు శిశు సంక్షేమం) సమావేశం నర్వ జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి అధ్యక్షతన జరగగా జడ్పీటీసీ సభ్యులు అశోక్‌, అంజలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:57:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising