నేటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు
ABN, First Publish Date - 2022-12-07T22:33:31+05:30
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు నేటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల కోసం స్టేడియం మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీలు ఆర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ చేతన
అభ్యర్థులకు ట్రయల్ రన్ నిర్వహణ
మహబూబ్‌నగర్, డిసెంబరు7: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు నేటి నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థుల కోసం స్టేడియం మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్లు జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, ఐపీఎస్ డా.చేతనలు స్టేడియం మైదానంలో ఏర్పాట్లు పరిశీలించారు. రేడియో ఫ్రీక్వెన్సీ, , సెన్సార్ పద్దతుల ద్వారా పరుగు, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్, ఎత్తు వంటి ఈవెంట్లు కొలిచే విధానాన్ని ట్రయల్‌రన్ ద్వారా గమనించారు. రన్నింగ్ ట్రాక్, గ్రౌండ్ నిర్వహణ పరిశీలించిన అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేహదారుఢ్య పరీక్షలు జరిపే అయా పరికరాల ను సంబంధిత అధికారులతో తనిఖీ చేయించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ అభ్యర్థుల సర్టిఫికెట్‌ల తనిఖీ మొదలు పరీక్షలు పూర్తిచేసుకుని బయటకు వెళ్ళేవరకు పోలీస్ అధికారులు, సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, కచ్చితంగా వ్యవహరించాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడ దన్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ అదనపు ఎస్పీ ఏ రాములు, డీఎస్పీలు, ఉమ్మడి జిల్లాకు చెందిన పోలీస్‌లు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T22:33:32+05:30 IST