ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2022-06-11T04:54:23+05:30

గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి, బడిబాట కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్ట ర్‌ షేక్‌యాస్మిన్‌ బాషా అన్నారు.

బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్‌గల్‌, జూన్‌ 10 : గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి, బడిబాట కార్యక్రమాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని  కలెక్ట ర్‌ షేక్‌యాస్మిన్‌ బాషా అన్నారు. మండలంలోని అన్నారం గ్రామంలో శుక్రవారం పల్లెప్రగతి, బడిబాట కార్యక్రమాలలో ఆమె పాల్గొని విద్యార్థులతో  మాట్లా డారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని, ప్రతీ గ్రామంలో పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిం చకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పని చేస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధించే విషయాన్ని తల్లిదండ్రులకు తెలపాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద మొక్కలు నాటి నీరు పోశారు. హరితహారం పట్ల నిర్లక్ష్యం వహించ కుండా మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ టీసీ సభ్యురాలు లక్ష్మి, సర్పంచు మేస్ర్తీ రాములు, ఉప సర్పంచు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మండల ప్రత్యేక ాధికారి సురేష్‌, తహసీల్దార్‌ చాంద్‌పాషా, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, చక్రపాణి, ఎంపీవో రఘురాం, ఏఈలు సత్తయ్య, నరసింహ, ఆర్‌ఐ మహేష్‌, వీఆర్‌ఏ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-11T04:54:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising