ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెదజల్లే పద్ధతిలో వరిసాగు ఉపయోగకరం

ABN, First Publish Date - 2022-05-26T05:11:47+05:30

వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేయ టంతోనే రైతుల కు ఉపయోగకరమని జిల్లా వ్యవసాయాధికారి బి.వెంకటేష్‌ అన్నారు.

రైతు వేదికలో రైతులకు సూచనలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలమూరు, మే 25 : వెదజల్లే పద్ధతిలో వరిసాగు చేయ టంతోనే రైతుల కు ఉపయోగకరమని జిల్లా వ్యవసాయాధికారి బి.వెంకటేష్‌ అన్నారు. బుధవా రం జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లిలో నిర్వహించిన రైతువేదికలో ఆయ న ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. వెదజల్లే పద్ధతిలో దమ్ము చేయ కుండా వరి పంటను సాగుచేసే విధానాలపై చర్చించారు. ఈ విధానంలో రైతు లు పాటించాల్సిన జాగ్రత్తలు, విత్తన వంగడాలను ఎంచుకోవటం, రెండు విధా నాలలో విత్తనాలను రెడీ చేసుకునే దానిపై చర్చించారు. ఎకరానికి 10గ్రాముల దొడ్డురకం విత్తనాలు సరిపోతాయని వివరించారు. భాస్వరం కరిగించే జీవన ఎరువులను అన్ని పంటలలో వాడుకోవచ్చన్నారు. పచ్చిరొట్ట ఎరువుల ఉపయో గించి సాగుచేయటంతో భౌతిక, రసాయన, జీవలక్షణాలు వృద్ధి చెందుతాయ న్నారు. వివిధ పంటలలో ఎరువుల యాజమాన్య పద్ధతులపై రైతులతో చర్చిం చారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ డా.యం.గోవర్ధన్‌, శాస్త్రవేత్త డా.రామకృష్ణ, యంఏఓలు, ఏఓలు, సహాయ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T05:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising