ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక దిగుబడి వచ్చే పంటలే వేసుకోవాలి

ABN, First Publish Date - 2022-06-27T04:29:37+05:30

రైతు లు అధిక దిగుబడి వచ్చే పంటలను సాగు చేసుకుని లాభాలు పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు.

రైతులకు మిరపనారు పంపిణీ చేస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వనపర్తి అర్బన్‌/ చిన్నమందడి, జూన్‌ 26: రైతు లు అధిక దిగుబడి వచ్చే పంటలను సాగు చేసుకుని లాభాలు పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఆదివారం చిన్నమందడి గ్రామంలో రైతులకు నాణ్యమైన కూరగాయల నారు ను రాయితీపై మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నాణ్యమైన నారును రాయితీపై సీవోఈ జీడిమెట్ల వారి నుంచి పొంద వచ్చని తెలిపారు. కూరగాయల్లో ప్రత్యేకంగా పందిరి కూరగాయలు సాగు చేసుకొనుటకు ఈజీఎస్‌ ద్వారా 100 శాతం రాయితీపై సన్న, చిన్నకారు రైతులకు అర ఎకరం విస్తీర్ణానికి రూ.1లక్ష 20వేలు ప్రభుత్వమే ఇస్తుందని ఆయన తెలిపారు. కూరగాయల రవాణా చేయుటకు ప్లాస్టిక్‌ ట్రేస్‌ని సబ్సిడీపై అందజేసేందు కు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఉద్యానశాఖ అధి కారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన శాఖ అధికారి శ్రీకాంత్‌, చిన్న మందడి సర్పంచు సూర్యచంద్రారెడ్డి, ఉప సర్పంచు  శ్రీనివాస్‌యాదవ్‌,  గ్రామ కమిటీ అధ్యక్షుడు  నరేష్‌, డీఎస్‌బీసీయూ నాగేంద్రంయాదవ్‌, రైతుబంధు అధ్యక్షుడు బాలరాజుయాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకు లు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-06-27T04:29:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising