ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు

ABN, First Publish Date - 2022-12-15T23:01:11+05:30

పోలీస్‌ ఉద్యోగాలకోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, డిసెంబరు15: పోలీస్‌ ఉద్యోగాలకోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో పురుషులకు నిర్వహించిన పరీక్షలకు 959 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 789 మంది హాజరయ్యారు. వీరికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 590 మంది అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించి తదుపరి పరీక్షకు ఎంపికయ్యారు. 74 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. మహిళల కన్నా పురుషుల దేహదారుఢ్య పరీక్ష ల్లో అర్హత శాతం తక్కువగా ఉండటం గమనార్హం. బుధవా రం మహిళలకు నిర్వహించిన పరీక్షలలో ఎత్తు పెంచుకునేం దుకు తలపై ఎం సీల్‌తో అభ్యర్థి హాజరై దొరికిపోయిన విషయం తెలిసిందే. దీంతో గురువారం ఈవెంట్లను మరింత పకడ్బందీ చేశారు. పోలీసులు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులపైనా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మైదానమంతా సీసీ కెమెరాలు ఉండటంతో ఈవెంట్లను సాంకే తిక పరిజ్ఞానంతో లెక్కిస్తుండటంతో అవకతవకలకు అవకాశం లేకున్నా పోలీసులు అందరిపై నిఘా ఏర్పా టు చేసినట్లు సమాచారం. ఈ వెంట్లను ఎస్పీలు ఆర్‌ వెంకటేశ్వర్లు, డా.చేతన, అడిషినల్‌ ఎస్పీ రాములు పర్యవేక్షించారు.

Updated Date - 2022-12-15T23:01:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising