ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పింఛన్‌ కోసం రోడ్డెక్కిన వృద్ధులు

ABN, First Publish Date - 2022-10-08T04:39:39+05:30

పింఛన్‌ డబ్బుల కోసం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో వృద్ధులు శుక్రవారం రోడ్డెక్కారు. ఒకటో తేదీన పడాల్సిన డబ్బులు నెల రోజులు దాటినా పడకపోవడంతో ఆందోళనకు దిగారు.

అయిజలో రోడ్డుపై బైఠాయించిన పింఛన్‌దారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అయిజ, అక్టోబరు 7: పింఛన్‌ డబ్బుల కోసం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజలో వృద్ధులు శుక్రవారం రోడ్డెక్కారు. ఒకటో తేదీన పడాల్సిన డబ్బులు నెల రోజులు దాటినా పడకపోవడంతో ఆందోళనకు దిగారు. పట్టణంలోని గద్వాల రహదారిలో రోడ్డుకు అడ్డంగా ముళ్ళ కంప, రాళ్లు పెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోజూ బ్యాంకులకు, మీసేవ కేంద్రాలకు వెళ్లి డబ్బులు పడ్డాయా? అని అడగడానికే సరిపోతుందని వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వృద్ధులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాకు పెద్ద కొడుకు అని చెప్పుకునే సీఎం కేసీఆర్‌ నెల దాటి వారాలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వడం లేదని, ఇంట్లో కుటుంబీకులు డబ్బులు తెచ్చుకుని తిన్నావా? అని అడుగుతున్నారని అన్నారు. దసరా పండుగ రోజున పస్తులు ఉండాల్సి వచ్చిందని చెప్పారు. మాకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు సర్దిచెప్పటంతో గంట తర్వాత ఆందోళన విరమించారు.

Updated Date - 2022-10-08T04:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising