ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువును పరిశీలించిన అధికారులు

ABN, First Publish Date - 2022-07-02T05:18:23+05:30

గద్వాల జిల్లా కొండేరు శివారులోని లక్ష్మమ్మ చెరువులో ఓ ఫ్యాక్టరీ కలుషిత నీరు కలవడం వల్ల చేపలు మృతి చెందడంపై ‘కాలుష్యం కాటు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన క థనానికి అధికారులు స్పందించారు.

చెరువును పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండేరు లక్ష్మమ్మ చెరువులో కలుషిత నీరు చేరి ఉండొచ్చన్న మత్స్యశాఖ అధికారి రూపేందర్‌సింగ్‌

నీటిని తీసుకెళ్లి పరిశీలించి నిర్ధారిస్తామని వెల్లడి

జరిగిన నష్టంపై ఆరా


ఎర్రవల్లి చౌరస్తా, జూలై 1: గద్వాల జిల్లా కొండేరు శివారులోని లక్ష్మమ్మ చెరువులో ఓ ఫ్యాక్టరీ కలుషిత నీరు కలవడం వల్ల చేపలు మృతి చెందడంపై ‘కాలుష్యం కాటు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన క థనానికి అధికారులు స్పందించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్‌సింగ్‌ శుక్రవారం లక్ష్మమ్మ చెరువును పరీశీలించారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న కలుషిత నీరు చెరువులోకి చేరే అవకాశం ఉందని, చెరువులోని నీటిని తీసుకెళ్లి పరీశీలించి నిర్ధారిస్తామని అన్నారు. తదుపరి రిపోర్ట్‌లను కలెక్టర్‌కు సమర్పిస్తామని మత్స్యకారులతో పేర్కొన్నారు. సొసైటీ అధ్యక్షుడు మద్దిలేటిని అడిగి జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. 

Updated Date - 2022-07-02T05:18:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising