ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘర్షణ కాదు.. తోపులాట

ABN, First Publish Date - 2022-09-18T04:44:19+05:30

జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మునిసిపల్‌ కేంద్రం డిగ్రీ కళాశాలలో జరిగిన ఘటన ఘర్షణ కాదని.. కేవలం తోపులాట మాత్రమేనని అదీ సాయిచంద్‌ అనుచరుల వల్ల జరిగిందేనని ఆయనకు, మాకు ఎలాంటి విభేదాల్లేవని అలంపూర్‌ ఎమ్మెల్యే డా.అబ్రహాం అన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అబ్రహాం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వడ్డేపల్లి ఘటనపై ఎమ్మెల్యే అబ్రహాం స్పందన


అలంపూర్‌ చౌరస్తా, సెప్టెంబరు 17: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మునిసిపల్‌ కేంద్రం డిగ్రీ కళాశాలలో జరిగిన ఘటన ఘర్షణ కాదని.. కేవలం తోపులాట మాత్రమేనని అదీ సాయిచంద్‌ అనుచరుల వల్ల జరిగిందేనని ఆయనకు, మాకు ఎలాంటి విభేదాల్లేవని అలంపూర్‌ ఎమ్మెల్యే డా.అబ్రహాం అన్నారు. శుక్రవారం జాతీయ సమైక్య వజ్రోత్సవంలో డా.అజయ్‌ అనుచరులకు, సాయిచంద్‌ అనుచరుల మధ్య జరిగిన ఘటనపై అజయ్‌ తండ్రి అబ్రహాం స్పందించారు. శనివారం అలంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అబ్రహాం విలేకరులతో మాట్లాడారు. కొన్నిరోజులుగా సాయిచంద్‌ అనుచరులు కొంతమంది నియోజకవర్గ రాజకీయాల్లో వేలు పెడుతూ వివాదాలకు కారణమౌతున్నారన్నారు. వడ్డేపల్లి సభకు సాయిచంద్‌ వచ్చినా మేము విభేదించలేదని, సభ ఆనంతరం ఆయన అనుచరులు, అజయ్‌ అనుచరుల మధ్య తోపులాట జరుగుతుండగా వారించేందుకు వెళ్లాడు తప్పా ఘర్షణకు కాదని, అనవసరంగా నా కుమారుడిపై నిందలు మోపడం సరికాదు.. నాకు, నా కుమారుడికి సాయిచంద్‌పై ఎలాంటి వివాదాలు లేవన్నారు. సాయిచంద్‌ మా పార్టీ సభ్యుడు కాబట్టి ఏవెుౖనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్టానం వద్ద మాట్లాడుకుని పరిష్కరించుకొని ముందుకు సాగుతామని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-09-18T04:44:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising